Analists Dasari Vignan & Damu Balaji : ఆస్తిలో తారకరత్న వాటాని ఆ ట్రస్ట్ కి రాసిచ్చారు… ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసింది తానే…: దాసరి విజ్ఞాన్ & దాము బాలాజీ

Analists Dasari Vignan & Damu Balaji : నలభై ఏళ్లకే గుండెపోటుతో అర్థాంతరంగా నందమూరి తారకరత్న మరణించారు. ఇక ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబానికి దూరమయ్యాడు. ఇక తారకరత్న మృతితో ఆయన భార్య పిల్లలు బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే సంశయం అందరిలోనూ ఉండగా చావు సమయంలో కూడా తారకరత్న తండ్రి కొడుకు ఇంటికి రాకపోవడం వల్ల ఇక అలేఖ్య రెడ్డికి అత్త మామాల సపోర్ట్ ఉండదనే అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ గా మరో వార్త వైరల్ అవుతోంది.

ఆస్తి లో వాటా ట్రస్ట్ కి రాసిన రూప…

మోహన్ కృష్ణ గారు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అవడం వల్ల కొడుకును ప్రేమ వివాహం చేసుకున్నందుకు పదేళ్ళైనా ఇంకా క్షమించలేదు. ఇక చివరికి కొడుకు మరణించినా కూడా ఆయన కరుగలేదు. తారకరత్న పిల్లలను దగ్గరకు తీసుకోలేదు. అలాంటి మోహన్ కృష్ణ కొడుకు మీద కోపంతో ఆస్తి మొత్తం కూతురు మోహన్ రూప కు రాసిచ్చేసారు. ఇక ఈ విషయం గురించి అనలిస్ట్స్ దాసరి విజ్ఞాన్ మరియు దాము బాలాజీ మాట్లాడుతూ రూప కు ఆస్తి రాసివ్వడం వల్ల అందరూ రూప ను అలా ఎలా ఆస్తి తీసుకుంటావు అంటూ నెగెటివ్ గా మాట్లాడుతున్నారు.

కానీ వాస్తవానికి రూప తన అన్న ఆస్తిని తీసుకుని అన్న తారకరత్న పేరు మీద ట్రస్ట్ పెట్టి సామాజిక కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అంటూ చెప్పారు. ఇక ఆ ట్రస్ట్ లో అలేఖ్య రెడ్డిని కూడా భాగస్వామిని చేస్తూ నిర్ణయం తీసుకున్నారట. మోహన్ రూపకు తన అన్న అంటే చాలా ఇష్టమైనా తండ్రి మాట కాదనలేక ఆస్తి తీసుకుని అన్న పేరున ట్రస్ట్ పెడుతోందని దాము బాలాజీ మరియు దాసరి విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు.