Poonam Kaur: సాధారణంగా సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలతో పాటు సినీ వ్యక్తిగత విషయాల గురించి స్పందిస్తూ ఉంటారు. ఇలా తమ వ్యక్తిగత విషయాల గురించి పోస్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు ట్రోల్ అవుతూ ఉంటారు.ఇది సెలబ్రిటీలకు సర్వసాధారణం అయితే సమాజంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ విషయంపై కూడా కొందరు స్పందిస్తూ ఉంటారు.
అయితే ఇలాంటి ఘటనలపై స్పందించే సమయంలో సెలబ్రిటీలు ఒకటికి రెండుసార్లు ఆ విషయం గురించి తెలుసుకొని ఆచితూచి మాట్లాడటం ఎంతో అవసరం అలా కాకుండా ఏదైనా చిన్న పొరపాట్లు కనక జరిగితే పెద్ద ఎత్తున నేటిజన్లో ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఇలా నేటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు నటి పూనమ్ కౌర్.
హైదరాబాదులో డాక్టర్ ప్రీతి సంఘటన ప్రస్తుత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈమె ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఈ ఘటనపై పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది అయితే ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇలా ప్రీతి విషయంపై నటి పూనమ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మనుగడ , పరువు, న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది.. వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవలసి వచ్చింది.. మరియు ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు.. ఏ శిక్ష అయినా నొప్పికి సరిపోదు, లేదా న్యాయం పొందదు’’.. అని రాసుకొచ్చింది.. దీంతో, ఈ ట్వీట్ చదవిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతూ తన పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పిన మాట వాస్తవమే కానీ తాను చనిపోయినట్లు ట్రీట్ చేయడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ మండిపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…