సాధారణంగా సినిమా ధియేటర్ కి వెళ్తే సినిమాను కేవలం ఒక రెండు గంటల పాటు ఎంతో ఆసక్తిగా కూర్చుని చూస్తాము. అయితే బాహుబలి వంటి చిత్రాలను మరో అరగంట ఓపికతో కూర్చుని చూడవచ్చు కాని అంతకు మించి అంటే ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ఆసక్తి కనబరచరు. అందుకోసమే ఈ మధ్యకాలంలో సినిమా ఎక్కువ నిడివి ఉంటే దానిని రెండు భాగాలుగా చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఓకే సినిమాను ఏకంగా నాలుగు గంటలపాటు థియేటర్లలో ప్రదర్శితం అయిన సినిమాలు కూడా ఉన్నాయి.
నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాలకు 2 ఇంటర్వెల్ వేసి బ్రేక్ ఇచ్చేవారంటే వినడానికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అయితే అలాంటి సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం పాలయ్యాయి.
ఇలాంటి చిత్రాలలో మొదటగా చెప్పుకోవాల్సిన చిత్రం జె పి దత్త తీసిన ఎల్ ఓ సి కార్గిల్. సుదీర్ఘమైన యుద్ధ పోరాటాలతో ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇందులో అక్కినేని నాగార్జున కూడా నటించారు. ఇలా ఈ సినిమా 4 గంటల 15 నిమిషాల నిడివి ఉంది. ఇందులో యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో అసహనానికి గురి చేసాయి.
ఈ సినిమా కంటే ముందుగానే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు నటుడు రాజ్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేరా నామ్ జోకర్ 4 గంటల 4 నిమిషాల నిడివి ఉంది. జీవితంలో విషాద ప్రేమ కథ సాగదీసి చెప్పడంతో ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమాను తెరకెక్కించి ఆర్థికంగా బాగా నష్టం రావడంతో కొన్ని సంవత్సరాలకు రీ ఎడిటింగ్ చేసి మంచి గుర్తింపు పొందారు.
తమిళ దర్శకుడు చేరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తవమై తవమరిందు (నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ) సినిమా సెన్సార్ కు వెళ్ళినప్పుడు ఏకంగా 4 గంటల 35 నిమిషాల నిడివి ఉంది. కానీ థియేటర్ లోకి విడుదలైనప్పుడు ఒక గంట కట్ చేసి విడుదల చేయాల్సి వచ్చింది.
ఇక తెలుగులో దానవీరశూరకర్ణ సినిమా కూడా 3:30 నిముషాలు నిడివి ఉంది. వీటితో పాటు బాలీవుడ్లో పలు చిత్రాలు కూడా మూడు గంటలకు పైగా లెంత్ ఉన్న చిత్రాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…