Analyst adusumilli Srinivasa Rao : చంద్రబాబు ఖమ్మం సభకు వచ్చిన జనాలను చూసి ఆ పార్టీ వాళ్లకు దడ పుట్టిందా?? జరగబోయేది ఇదే : అనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాసరావు

Analyst Adusumilli Srinivasarao : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిణ పరిస్థితులు తెలుగుదేశం పార్టీని ఘోరంగా దెబ్బతీశాయి. ఒకవైపూ ఆంధ్రప్రదేశ్, మరో వైపు తెలంగాణ ప్రజల మనోభావాల నడుమ ఆ ఎన్నికల్లో టీడీపీ తుడిచి పెట్టుకుని పోతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తెరాస, కాంగ్రెస్ మధ్య నేను ఉన్నాను అని నిలబడింది. కానీ మెల్లగా తెరాస లోకి తెలుగుదేశంలో ఉన్న నాయకులాంతా వెళ్లిపోయి పార్టీ కి తెలంగాణలో చోటు లేకుండా చేసారు. కానీ ఇదంతా పైకి మాత్రమే ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం కు సరైన నాయకత్వం లేదు కానీ ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. ఇది మరోసారి ఖమ్మం చంద్రబాబు మీటింగ్ తో రుజువైంది.

ఆ సభతో ఆ పార్టీకి భయం పుట్టించింది…

చంద్రబాబు బాబు చాలా రోజుల తరువాత తెలంగాణ లో సభ పెట్టారు. అందులో పెద్దగా లీడర్లు టీడీపీ కి లేరు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేని ఖమ్మంలో ఆయన సభ పెడితే ఎంతో మంది జనాలు సభకు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ఒక విమర్శ పాలకులను, ప్రత్యర్థులను చేయలేదు కానీ ఈ సభ తరువాత తెరాస పార్టీ నాయకులు స్పందించి విమర్శించారు. ఇక ఈ విషయం గురించి ఆడుసుమిల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ కి నాయకులు లేరు కానీ కార్యకర్తలు కాదు. ఈ సభలో అదే రుజువైంది అంటూ చెప్పారు. ఒక గుర్తింపు ఉన్న నాయకుడు నడిపిస్తే మళ్ళీ తెలంగాణలో టీడీపీ కి పునర్వైభవం వస్తుంది అంటూ చెప్పారు. టీడీపీ నాయకులను తెరాస కలుపుకున్న టీడీపీ అభిమానులు ఇంకా ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు.

కానీ వారి ఓట్లు ఇప్పుడు టీడీపీ యాక్టీవ్ గా లేదు కాబట్టి చీలుతోంది కానీ ఒక్కసారి టీడీపీ మళ్ళీ ఫామ్ లోకి వస్తే ఖచ్చితంగా ఓట్లు పడతాయి, అధికారాన్ని ఏర్పాటు చేయలేక పోవచ్చు కానీ డిసైడర్స్ గా మారుతుంది. తెరాస అంటే తెలంగాణలో వ్యతిరేకత లేకపోయినా ఈసారి మాత్రం తెరాస ఎన్నికలంటే భయం పట్టుకుంది. సరైన నాయకత్వం వస్తే టీడీపీ ప్రత్యర్థి గా మారుతుందని చంద్రబాబు ను విమర్శించారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన ఎత్తారు. అయితే మరి ఆ తరువాత వైస్సార్ వచ్చినపుడు ముదిగొండ కాల్పులు, సోంపేట కాల్పుల గురించి ఎందుకని షర్మిలను విమర్శించరు. తెరాస కు టీడీపీ భయం ఉంది, ఇప్పుడు విమర్శించిన వారంతా ఒకప్పుడు టీడీపీ వాళ్లే అంటూ ఆడుసుమిల్లి అభిప్రాయపడ్డారు. టీడీపీ వల్ల ఓట్లు చీలుతాయి, అది ఎవరికి లాభమో ఎవరికి వారు బేరీజు వేసుకుంటున్నారు కానీ వాస్తవం ఇంకా తెలియదంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago