Featured

Analyst Damu Balaji : అప్సరను చంపింది నా భర్త కాదు… సాయికృష్ణ భార్య శ్రావణి హాట్ కామెంట్స్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : నేటి సమాజంలో నేరాలు జరగడానికి ప్రధాన కారణం డబ్బు లేకపోతే వివహేతర సంబంధాలు. ఎక్కువగా వెలుగుచూస్తున్న క్రైమ్స్ వీటి వల్లే జరుగుతున్నాయి. భార్యభర్తల మధ్య మరో వ్యక్తి ఉండటమే చాలా కుటుంబాలలో కలహాలకు కారణమవుతోంది. భార్య భర్తల్లో ఎవరో ఒకరు వేస్తున్న తప్పటడుగు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఎంతో చక్కగా సాగుతున్న సాయికృష్ణ అనే పూజారి జీవితంలో కూడా వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. సాయి కృష్ణను నేరస్తుడిగా మార్చింది. అప్సర అనే యువతితో పెళ్ళైన సాయికృష్ణ నడిపిన అక్రమ సంబంధం చివరకు అప్సరను సాయి కృష్ణ హత్య చేసేవరకు వెళ్ళింది. అయితే ఈ కేసులో సాయి కృష్ణ భార్య శ్రావణి ఆమె భర్తను వెనకేసుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నా భర్త అటువంటి వాడు కాదు…

సరూర్ నగర్ కి చెందిన వెంకట సూర్య సాయి కృష్ణ అనే 36 ఏళ్ల వ్యక్తి అక్కడి స్థానిక దేవాలయంలో పూజారిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బిల్డర్ గా ఉన్న సాయి కృష్ణ కు తన తండ్రికి అక్కడి చుట్టుపక్కల మంచి పలుకుబడి ఉంది. ఇక చెన్నై నుండి వచ్చి సరూర్ నగర్ లో స్థిరపడిన అప్సర అనే 30 ఏళ్ల యువతి తన తల్లితో పాటు ఉంటోంది. అప్సర తండ్రి కాశిలో పని చేస్తుండగా ఇక్కడ తల్లి వద్దే ఉంది అప్సర. ఇక తనకు ఒక అక్క ఉండగా ఆమెకు పెళ్ళై చెన్నై లో ఉంది. అప్సర గుడికి వెళ్తుండగా సాయికృష్ణ పరిచయం అవడం, ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడం జరిగాయి. చివరకు సాయి కృష్ణ అప్సరను హత్య చేసేవరకు పరిస్థితులు వెళ్లాయి.

కానీ సాయి కృష్ణ భార్య శ్రావణి మాట్లాడుతూ తన భర్త మంచివాడని, ఆడవాళ్లతో బాగా మాట్లాడేవాడే కానీ ఎటువంటి తప్పు చేయలేదని, అప్సర విషయంలో కూడా ఆమె గురించి చెప్పేవాడని అప్సరతో వివాహేతర సంబంధం లాంటివి లేవని ఆమె చనువుగా ఉంటూ పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడం చేసిందని భార్య తెలిపింది. ఇక అప్సర హత్య తన భర్త చేయలేదని శ్రావణి చెబుతున్నట్లు బాలాజీ తెలిపారు. ఆమె గతం మాకు తెలియదని తన భర్తే హత్య చేసాడని తాను నమ్మడం లేదని శ్రావణి తెలిపారు. ఇక ఈ కేసులో ఆల్రడీ సాయి కృష్ణ తాను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నా ఆయన భార్య శ్రావణి తన భర్త హత్య చేయలేదని మాట్లాడటం విడ్డూరంగా అనిపిస్తోందని అనలిస్ట్ బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago