Analyst Damu Balaji : నేటి సమాజంలో నేరాలు జరగడానికి ప్రధాన కారణం డబ్బు లేకపోతే వివహేతర సంబంధాలు. ఎక్కువగా వెలుగుచూస్తున్న క్రైమ్స్ వీటి వల్లే జరుగుతున్నాయి. భార్యభర్తల మధ్య మరో వ్యక్తి ఉండటమే చాలా కుటుంబాలలో కలహాలకు కారణమవుతోంది. భార్య భర్తల్లో ఎవరో ఒకరు వేస్తున్న తప్పటడుగు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఎంతో చక్కగా సాగుతున్న సాయికృష్ణ అనే పూజారి జీవితంలో కూడా వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. సాయి కృష్ణను నేరస్తుడిగా మార్చింది. అప్సర అనే యువతితో పెళ్ళైన సాయికృష్ణ నడిపిన అక్రమ సంబంధం చివరకు అప్సరను సాయి కృష్ణ హత్య చేసేవరకు వెళ్ళింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే…
సరూర్ నగర్ కి చెందిన వెంకట సూర్య సాయి కృష్ణ అనే 36 ఏళ్ల వ్యక్తి అక్కడి స్థానిక దేవాలయంలో పూజారిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బిల్డర్ గా ఉన్న సాయి కృష్ణ కు తన తండ్రికి అక్కడి చుట్టుపక్కల మంచి పలుకుబడి ఉంది. ఇక చెన్నై నుండి వచ్చి సరూర్ నగర్ లో స్థిరపడిన అప్సర అనే 30 ఏళ్ల యువతి తన తల్లితో పాటు ఉంటోంది. అప్సర తండ్రి కాశిలో పని చేస్తుండగా ఇక్కడ తల్లి వద్దే ఉంది అప్సర. ఇక తనకు ఒక అక్క ఉండగా ఆమెకు పెళ్ళై చెన్నైలో ఉంది. అప్సర గుడికి వెళ్తుండగా సాయికృష్ణ పరిచయం అవడం ఆపరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడం జరిగాయి.
గతంలో ఒకసారి కూడా అప్సర గర్భం దాల్చగా సాయికృష్ణ ఒప్పించి అబార్షన్ చేయించాడు. ఇక తాజాగా ఆమె మరో సారి గర్భం దాల్చగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో సాయి కృష్ణ ఆమెను కారులో తీసుకెళ్లి రాయితో కొట్టి చంపేసి శవాన్ని ప్రభుత్వ కార్యాలయం వెనుక మ్యాన్ హోల్ లో వేసి ఇసుక వేసి కప్పేసాడు. అయితే నిజం ఎంతో సేపు దాగదు, పోలీసుల విచారణలో నిజం కక్కేసాడు సాయికృష్ణ. అయితే తాజాగా అప్సర పోస్టుమార్టం రిపోర్ట్ కేసులో కీలకం కాగా అందులో అప్సర గర్భవతి కాదు అని తెలిసిందని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. అయితే అప్సర ఒత్తిడి తేవడం వల్లే సాయికృష్ణ పరువు పోతుందని భయపడి హత్య చేశాడని బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…