Analyst Damu Balaji : అవినాష్ రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న సంబంధం ఏమిటి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ప్రస్తుతం ఏపీ లో హాట్ టాపిక్ వివేకానంద రెడ్డి హహ్య కేసు. ఈ కేసులో మొదటి నుండి అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా సిబిఐ భావిస్తూ ఆయనను అరెస్టు చేయాలని కోర్టు అనుమతి అడుగుతున్నా కోర్ట్ లో చుక్కేదురు కావడానికి కారణం అవినాష్ రెడ్డి తరుపున వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి. ఆయన వాదన ముందు సునీత రెడ్డి తరుపు లాయర్స్ అలాగే సిబిఐ న్యాయవాదులు మౌనంగా ఉండాల్సి వస్తుంది. రేపో మాపో అరెస్టు అన్న పరిస్థితి నుండి తాజాగా 25 వరకు అవినాష్ ను అరెస్టు చేయడానికి వీలు లేదని కోర్ట్ తీర్పు ఇచ్చేదాకా తన పాయింట్స్ తో కోర్ట్ ను కన్విన్స్ చేసారు నిరంజన్ రెడ్డి. అయితే ప్రస్తుతం ఈయన గురించి తెలుసుకోడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక ఆయన గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు. అలాగే ఆయనకు మెగాస్టార్ కు ఉన్న లింకేంటి అని కూడా వివరించారు.

ఆచార్య ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి…

ఇపుడు అందరి చూపులు నిరంజన్ రెడ్డి వైపే. నిరంజన్ రెడ్డి గారిది తెలంగాణ, నిర్మల్ ప్రాంతం. నిరంజన్ ఏపీ సీఎం జగన్ కు సిబిఐ కేసులు వాదించే వ్యక్తిగత న్యాయవాది. ఇక ఈయన సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆచార్య లాంటి భారీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిరంజన్ అంతకుముందు కూడా క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్, అర్జుణ ఫాల్గుణ వంటి చిత్రాలను ప్రొడ్యూసర్ చేసారు. 2011 నుండి జగన్ అక్రమ ఆస్తుల కేసులో లాయర్ గా వ్యవహరిస్తున్నారు.

1970 జూలై 22 వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నిరంజన్ తన న్యాయవాద విద్యను పూణేలోని సింబయాసిస్ లా కాలేజీలో ఐదేళ్ల కోర్సు చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ న్యాయవాదులైన మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిల వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2016లో అప్పటి ఏపీ ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా హోదాను కల్పించింది. అంతేకాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే సినిమాలపై మక్కువతో నిర్మాతగా మారారు. ఇక ఈయన రాజ్యసభ కు ఏపీ నుండి నామినేట్ అయ్యారు. ఇలా అటు సినిమాల్లోను ఇటు న్యాయవాదిగాను ప్రాముఖ్యం ఉన్న నిరంజన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ ను బయటపడేస్తారనే నమ్మకం తోనే జగన్ ఈ కేసు ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది అంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago