Featured

Analyst Damu Balaji : ఆఫీస్ బాయ్ లా వచ్చి కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు… బండ్ల గణేష్ కు నయీం నుండి బెదిరింపు కాల్స్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించారు. ఎన్నో కాంట్రావెర్సీ లకు కేర్ ఆఫ్ గా నిలబడిన బండ్ల గణేష్ ఒకప్పుడు స్టార్ హీరోల్తో సినిమాలను తీసి వరుస హిట్లను చూసారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో లేకపోయినా పాలిటిక్స్ గురించి అలానే సినిమా ఇండస్ట్రీ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ బాగా సోషల్ మీడియాలో నానే బండ్ల అన్న ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలతోనే బాగా ఫేమస్ అవుతుంటాడు. ఇక బండ్ల గణేష్ జీవితం గురించి అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషించారు.

ఆఫీస్ బాయ్ గా చేరి కోట్లకు ఎలా చేరాడు…

బండ్ల గణేష్ మొదట్లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినపుడు కేఎస్ రామారావు ఆఫీస్ లో బాయ్ గా చేరాడనే కథనాలు ఉన్నాయి. అయితే బండ్ల గణేష్ మాత్రం తాను రావడమే ప్రొడక్షన్ పనులు చూసుకునే వాడినని పలు ఇంటర్వ్యూలో చెబుతుంటారు. తన బంధువు ఒకరు డిస్ట్రిబ్యూషన్ లో ఉండటం వలన అతని ద్వారా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయంటూ చెప్తారు. ఇక మెగాస్టార్ అభిమానిగా సినిమాల్లో అడుగుపెట్టిన బండ్ల గణేష్ మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేసేవాడు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమా తీసే రేంజ్ కి ఎలా ఇదిగాడో అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ ఒకానొక టైంలో అతను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ బినామి అనే టాక్ బాగా నడించిందని తెలిపారు. అందువల్లే పెద్ద హీరోలతో కోట్లు పెట్టి సినిమా తీసాడని చెప్తారు. ఇక బండ్ల గణేష్ మాత్రం ఈ విషయంలో కూడా తాను ఎవరి బినామి కాదని, ఆయనతో కలిసి తిరగడం వల్ల అలా అనుకుంటున్నారని, పెద్ధ హీరోల డేట్స్ దొరకడమే కష్టం దొరికితే ఎవరైనా డబ్బులు పెడతారు నేనే పెట్టాల్సిన పని లేదు అంటూ చెప్పారు. ఇక బండ్ల గణష్ కు హీరో సచిన్ జోషికి కూడా క్లాష్ ఉంది అంటూ దాము బాలాజీ తెలిపారు.

సచిన్ జోషి తో సినిమా తీసిన బండ్ల గణేష్ అందులో 27 కోట్లు మోసం చేసాడని సచిన్ జోషి 14 కంప్లైంట్స్ అతని మీద పోలీస్ స్టేషన్ లో పెట్టాడు. ఈ వివాదం చివరికి నయీం వద్దకు చేరింది. బండ్ల గణేష్ కు నయీం తో పరిచయాలు ఉండటం వల్ల సచిన్ జోషిని బెదిరించడానికి నయీం దగ్గరికి వెళితే సచిన్ ఆధారాలతో సహా నయీంకు చెప్పడంతో నయీంసచిన్ కి సపోర్ట్ చేసి బండ్ల గణేష్ కు పిల్లలను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి 8 కోట్లు ఫైన్ వేసాడట. ఈ విషయాలు అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా ఉండేవని దాము బాలాజీ తెలిపారు. అందుకే నయీంచనిపోయినపుడు బండ్ల చాలా హ్యాపీ అయ్యాడు, కెసిఆర్ ను దేవుడితో పోల్చాడు అంటూ చెప్పారు దాము బాలాజీ.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago