Manchu Mohan Babu : మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మి తన భాష యాసతో మరింత ప్రాచుర్యం పొందింది. మొదట్లో టీవీ షోస్ తో ఆకట్టుకున్న లక్ష్మి ట్రోలర్స్ కి ఈమె ఏదైనా వేడుకలో మాట్లాడితే పండగే. ప్రస్తుతం టీవీ షోస్ చేయకుండా కేవలం సినిమాలతో బిజీగా ఉన్న లక్ష్మి మంచు రీసెంట్ గా మలయాళం సినిమా మాన్స్టర్ లో లెస్బియన్ లాగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన నటనతో మల్లు అభిమానులను ఆకట్టుకుంది. ఇక తన తముళ్ళు విష్ణు, మనోజ్ లు కూడా సినిమాల్లో ఉన్నా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ వీళ్ళ ఫ్యామిలీ లో సక్సెస్ చూస్తోంది మాత్రం మంచు లక్ష్మీనే అని చెప్పాలి. ఇక తండ్రికి తగ్గ తనయి అనిపించుకుంటున్న మంచు లక్ష్మి గురించి మంచు మోహన్ బాబు గారు గర్వంగా ఫీల్ అవుతుంటారు. తన కూతురు గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడారు.
లక్ష్మి ఎందరికో సహాయం చేస్తోంది…
మోహన్ బాబు గారు ఆయన కూతురు లక్ష్మి గురించి మాట్లాడుతూ తాను నటిగా మంచి గుర్తింవు తెచ్చుకుంది అలాగే తాను సామాజిక సేవ కూడా చాలా చేస్తుంది అంటూ చెప్పారు. పేద విద్యార్థులను చదివిస్తోంది అంటూ తెలిపారు. తనకున్న దాంట్లోనే ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటుంది. నేనే కొన్ని సార్లు ఎందుకమ్మా నీకవన్నీ నువ్వు హాయిగా ఉండొచ్చు కాదా అని చెప్తుంటాను కానీ తాను వినదు అంటూ కూతురుని ప్రశంసించారు.
ఇక కొడుకులు విష్ణు, మనోజ్ ల గురించి మాట్లాడుతూ విష్ణు ఇప్పటికే చాలా కాలం నుండి విద్యానికేతన్ విద్యాసంస్థసలను చూసుకుంటున్నాడు, తాను చాలా బాధ్యతగా ఉంటాడు, అన్ని పనులను చక్కబెట్టగలడు. ఇక మనోజ్ కి ఇంకా ఆ ఇంట్రస్ట్ లేదు, చూడాలి ఫ్యూచర్ లో వ్యాపారాలు చూసుకుంటాడేమో అంటూ తెలిపారు.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…