Analyst Damu Balaji : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈరోజు రావడం తో అక్కడ తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే పదేళ్ళ పాటు సీఎం గా ఉన్న కెసిఆర్ రాజీనామా చేయగా ఓటమికి గల కారణాలను అంచనా వేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఇది చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ అంటూ కెసిఆర్ మీద ట్రోల్స్ వేస్తున్నారు చాలామంది నెటిజన్స్. అసలు తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు ప్రభావం, ఎన్నికల కోసం చంద్రబాబు ఎలాంటి వ్యూహలను రచించారు వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.
కెసిఆర్ కి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ గట్టిగా ఇచ్చాడు….
దాము బాలాజీ తెలంగాణ ఫలితల గురించి మాట్లాడుతూ కెసిఆర్ గత ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా నిలిచి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ కామెంట్స్ చేసారు. అయితే చంద్రబాబు కూడా నెక్స్ట్ ఎన్నికలలో నీకు రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేస్తా అంటూ మాట్లాడటం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఇపుడు ఆయన మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ లో పోటీ చేయకుండానే అక్కడ కెసిఆర్ ఓటమికి మాత్రం కారణం అయ్యాడు ,ఇక ఇదే విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ చంద్రబాబు ఎపుడు ఖాళీగా లేరని ఆయన మౌనంగా ఉన్న వ్యూహ రచన చేస్తూనే ఉన్నారంటూ చెప్పారు.
ఆయన తెలంగాణ లో పోటీ చేయకుండా తన బలాన్ని కాంగ్రెస్ వైపుకు ముఖ్యంగా రేవంత్ గెలుపు కోసం ప్రయోగించారని తెలిపారు. ఆయన అరెస్ట్ అపుడు ఐటి ఉద్యోగుల ధర్నా సమయంలో కేటిఆర్ చేసిన వాఖ్యలు కూడా అక్కడి సెటిలర్స్ మీద ప్రభావం చూపాయని కెసిఆర్, కేటిఆర్ ల నోటి దూల వల్లే వారికి నష్టం చేకూరిందని బాలాజీ అభిప్రాయపడ్డారు. అలా కాంగ్రెస్ గెలుపుకు కెసిఆర్ వైఫల్యాలతో పాటు చంద్రబాబు కూడా కారణం అయ్యాడు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…