Analyst Damu Balaji : తెలంగాణ రాష్ట్రములో నేడు కొత్త సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ నుండి తొలిసారి ప్రభుత్వం ఏర్పడటం అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేడు ఎల్బి స్టేడియంలో అట్టహాసంగా ముఖ్యమంత్రి అలాగే పలు శాఖలకు మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. గతంలో కెసిఆర్ మరియు రేవంత్ మధ్య జరిగిన అనేక సంఘటనల నడుమ ఇపుడు రేవంత్ ఎలాంటి రివేంజ్ ప్లాన్ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ విషయాలలో గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
కెసిఆర్ అంతుచుస్తానన్న రేవంత్…
గతంలో ఓటుకు నోటు కేసు తదితర సంఘటనలలో రేవంత్ రెడ్డి పోలీసులు రాత్రి వేళ ఇంటినుండి బయటకు లాక్కొచ్చి అరెస్టు చేయడం వంటివి అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇక ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు సైతం వెళ్లగా విడుదల సమయంలో మీసం మేలేసి మరీ కెసిఆర్ నీ అంతు చూస్తా అంటూ ప్రతిజ్ఞ చేసాడని, ఇపుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కెసిఆర్ ను జైలుకు పంపే ప్లాన్ చేస్తాడని బాలాజీ అభిప్రాయపడ్డారు.
అయితే లోకసభ ఎన్నికల వరకు రేవంత్ ఎలాంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకోకపోవచ్చని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల తనకు నచ్చినట్లు చేయడానికి ఉండదంటూ బాలాజీ తెలిపారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండటం వల్ల బీజేపీ, కెసిఆర్ తో స్నేహపూర్వకంగానే ఉండటం వల్ల రేవంత్ ఆచితూచి వ్యవహారిస్తాడంటూ బాలాజీ తెలిపారు. కెసిఆర్ ను జైలుకు పంపే తతంగం లోకసభ ఎన్నికల అనంతరం ప్లాన్ చేసుకుంటాడని బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…