KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గాయాలు పాలైనట్లు తెలుస్తోంది. కెసిఆర్ గత రాత్రి తన ఇంటిలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన జారి కింద పడటంతో వెంటనే కుటుంబ సభ్యులు తనని హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ కెసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు.
గత రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈయన బాత్రూంలో కాలుజారి పడ్డారని తద్వారా ఆయన ఎముక విరిగినట్లు కుటుంబ సభ్యులు భావించి వెంటనే తనని మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
కాలు జారిపడ్డారు..
ఈయన కింద పడటంతో ఎముక విరిగిందని వైద్యులు వెల్లడించారు. అయితే ఇంకా హాస్పిటల్ నుంచి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది. అయితే కేసీఆర్ ఇలా ఆసుపత్రి పాలయ్యారు అనే విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలాగ ఉంది ఏంటి అనే విషయాలను వైద్యులు మరికొద్ది సేపటిలో హెల్త్ బులిటెన్ విడుదల చేయబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…