Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతూ డైలీ సీరియల్ ను తలపిస్తూ కొత్త క్యారెక్టర్స్ పుడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త వ్యక్తి పేరు ఈ కేసులో వినిపిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర విచారణ ఆగిపోయింది. అయితే ఇల్లీగల్ అఫైర్స్ వివేకానంద చావుకు కారణమని పలు మార్లు వినిపించినా వివేకానంద రెండో భార్య గురించి కూడా పలు కథనాలు వచ్చినా ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న ఆయన రెండో భార్య మొదటి సారి బయటికి వచ్చారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే కేసును తప్పుదోవ పట్టిస్తూ షమీమ్ ను ఈ కేసులోకి లాగుతున్నారు అంటూ కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.
సునీత రెడ్డి నరికేస్తా అని బెదిరింపులు…
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికీ అవినాష్ రెడ్డికి శిక్ష పడాలని సునీత రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తోంది. సిబిఐ ఒకవైపు గట్టిగా వాదనలు వినిపిస్తున్నా మరో వైపు వివేకానంద కూతురు సునీత రెడ్డి కూడా ఈ కేసులో చావో రేవో అన్నట్లుగా ఈ కేసులో ఫైట్ చేస్తోంది. తన తండ్రి హత్య కేసులో అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయించాలని సునీత గట్టిగా ఉంది.
అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డి వైపు నడుస్తుండగా మధ్యలో వివేకానంద రెడ్డి రెండో భార్య షమీమ్ గురించి వార్తలు మీడియాలో రావడం ఆమె అజ్ఞాతంలో ఉంది అంటూ కోర్ట్ కి హాజరైతే హత్య కేసు మలుపు తిరుగుతుంది అనే ఉద్దేశంతో డాక్టర్ సునీత రెడ్డి షమీమ్ ను బెదిరించినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. షమీమ్ ఆమె కొడుకు బ్రతకడానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం కానీ కేసు మధ్యలోకి రావొద్దు అని కోర్ట్ కి వస్తే నరికేస్తామని బెదిరించినట్లు వినిపిస్తోందని దాము బాలాజీ అభిప్రాయాపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…