Analyst Damu Balaji : తండ్రి లేడు, తల్లే అల్లారుముద్దుగా పెంచింది. బాగా కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్న శ్వేత కలలు పెళ్లితోనే ఆగిపోయాయి. పెళ్లయ్యాక చదువుకోడానికి ఒప్పుకుంటామని చెప్పి పెళ్లి చేసుకున్న భర్త పెళ్ళయ్యాక ఆ ఊసే ఎత్తలేదు. వావి వరసలు లేకుండా చెల్లి వరస అయ్యే శ్వేతతో ఆడపడుచు భర్త అసభ్యంగా ప్రవర్తించినా అత్తింటి వారు పట్టించుకోక పోగా తప్పు నీదేనని క్షమాపణ చెప్పించడంతో భరించలేక గర్భంతో ఉన్న తాను వైజాగ్ సముద్ర తీరాన శవమై కనిపించింది. అయితే ఈ కేసులో కొత్త కోణం తాజగా బయటికి వచ్చింది. శ్వేత భర్త కు మరో అమ్మాయితో ఉన్న సంబంధమె శ్వేత చావుకు కారణం అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ ప్రేయసితో శ్వేత భర్త…
శ్వేతను అత్తింటి వారు ఎంత వేధించినా తన భర్త ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో మరింత క్రుంగిపోయింది. అయితే శ్వేత భర్త శ్వేత ను ఏ మాత్రం ఇష్టపడలేదు, మొదటి నుండి ఆమెతో సరిగా లేడని అందుకే ఆమె మరణించినా పెద్దగా అతను బాధపడటం లేదని బాలాజీ అభిప్రాయాపడ్డారు. శ్వేత కూడా తాను రాసిన సుసైడ్ లెటర్ లో నేను చనిపోయినా నీకు పెద్దగా ఏమి అనిపించదు అని రాసింది. శ్వేత తో పెళ్లికంటే ముందే శ్వేత భర్తకు వేరే అమ్మాయితో రిలేషన్ ఉంది.
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల శ్వేత ను పెళ్లి చేసుకున్నాడు. శ్వేత తో అందుకే ప్రేమగా లేడు. ఇక అతని ప్రేయసికి అతనికి వేరే పెళ్ళైనా అభ్యంతరం లేదని చెప్పడంతో ఇటు శ్వేత తో ఉంటూనే హైదరాబాద్ లో ఆమెతో రిలేషన్ లో ఉన్నాడు. కానీ ఇంట్లో ఆడపడుచు, అత్త వేధింపులు భరించలేక మొగుడితో చెప్పుకున్నా అతను పట్టించుకోకపోవడం వల్లే శ్వేత మరణించింది. శ్వేత భర్త నిర్లక్ష్యమే శ్వేత మరణానికి కారణం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…