Analyst Damu Balaji : తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డి బయోగ్రఫీ.. ప్రేమ, పెళ్లి.. రేవంత్ రెడ్డి నుండి రేవంతన్న వరకు ఆయన ప్రస్థానం…: అనలిస్ట్ దాము బాలజీ

Analyst Damu Balaji : తెలంగాణ ఎన్నికలు ముగిసాయి… గెలుస్తామన్న ధీమాతో ముందస్తుకు వెళ్లిన కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆలోచనలను అంచనా వేయడంలో విఫలమయ్యారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్లకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగా సీఎం రేస్ లో అందరి నోటా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. నిజానికి ఎన్నికలకు మూడు నెల్లముందు కూడా బిఆర్ఎస్, రెండో స్థానంలో బీజేపీ ఉండగా మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా గెలవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కాబోతున్న తరుణం ఆయన జీవితం, సీఎంగా ఆయన ఎదిగిన తీరు అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

విద్యార్ధి రాజకీయాల నుండి నేడు సీఎం పదవి వరకు…

1969 లో మహబూబ్ నగర్ కొండారెడ్డి గ్రామంలో జన్మించిన అనుముల రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఏబివిపి విద్యార్థి సంఘంలో ఉన్న ఆయన ఆర్ఎస్ఎస్ లో కూడా ఉన్నారు. అయితే చదువుయ్యాక అందరూ బీజేపీ పార్టీ వైపు వెళ్తారనుకుంటే ఎన్టీఆర్ మీద అభిమానము, అలాగే చంద్రబాబు మీద అభిమానంతో 2005లో ఆయన టీడీపీ పార్టీలోకి చేరి అధిష్టానం వద్దని చెప్పినా మేడ్చల్ మండలం జెడ్పిటిసి మెంబెర్ గా గెలిచారు. ఆపైన 2009 ఎమ్మెల్సిగా గెలుపొందిన ఆయన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కి ప్రియ శిష్యుడిగా మారాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తెలంగాణ విడిపోయాక 2017లో కాంగ్రెస్ చేరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముగ్గురిలో ఒక్కడిగా ఎన్నికయ్యడు.

2018 లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన మల్కాజిగిరి నుండి ఎంపి గా గెలిచారు. ఇక తాజాగా తెలంగాణ ఎన్నికలలో ఆయన గెలవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి బాలాజీ మాట్లాడుతూ ఆయన ఇంటర్ చదివే సమయంలోనే గీత అనే అమ్మాయిని ప్రేమించగా ఆమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి గారి తమ్ముడి కూతురు కాగా డిగ్రీ చదివే సమయంలో వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి గీతను ఢిల్లీలో చదివించారు. అయితే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా జైపాల్ రెడ్డి గారి వద్దకే వెళ్లి తమ ప్రేమ వ్యవహారం చెప్పడంతో ఆయన ముక్కుసూటి తనం, ధైర్యం నచ్చి రాజకీయాల్లో ఖచ్చితంగా రానిస్తాడనే నమ్మకం కలిగి తమ్ముడికి చెప్పి పెళ్లి చేసారు. అలా రేవంత్ రెడ్డి గారు కష్టపడి తన లవ్ లైఫ్ అలాగే పొలిటికల్ లైఫ్ లోనూ సక్సెస్ అయ్యారు. ఇక ఆయన ఓటుకు నోటు కేసు సమయములో చంద్రబాబు పేరు చెబితే ఆయన సేఫ్ అవుతాడని తెలిసినా నిబద్దతతో వ్యవహరించి చంద్రబాబు ప్రియ శిష్యుడిగా మరోసారి రుజువు చేసుకున్నాడు. నిజానికి ఓటుకి నోటు కేసు ద్వారానే రేవంత్ కి మరింత ప్రాచుర్యం లభించింది అనడంలో సందేహం లేదు. తెలంగాణ రాజకీయనాయకులలో కెసిఆర్ ను ధైర్యంగా తన మాటలతో ఢీ కొట్టగల నాయకుడు రేవంత్ మాత్రమే. ఇక ఆయన స్పీచ్ లతో తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి కాస్తా రేవంతన్నగా ఆదరణ చూరగున్నారు అంటూ బాలాజీ రేవంత్ రెడ్డి గారి జీవితం గురించి వివరించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago