Categories: FeaturedMovie News

Analyst Damu Balaji : పరుచూరి భార్య విజయలక్ష్మి పై పోసాని కృష్ణ మురళి వేట కత్తితో దాడి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి. నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొచ్చే పోసాని విభిన్నంగా విలనిజం చూపిస్తాడు అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసే సమయంలోనే వర్మ సినిమాలో అవకాశం వచ్చినా పని పూర్తిగా నేర్చుకున్నాకే చేస్తానని చెప్పి తిరస్కరించిన పోసాని ఆ తరువాత గాయం, నాగార్జున రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉన్న పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఈయన తాజాగా వరుసగా సినిమా ఇండస్ట్రీ వాళ్లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఆయన గురించిన పలు ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

పరుచూరి భార్య మీదే కత్తి దాడి…

పోసాని గారు ఎంఫిల్ చేస్తున్న సమయంలోనే పొట్టకూటి కోసం ఎవరైనా రైటర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలని అనుకున్నారట. అలా పోసాని గారు పరుచూరి బ్రదర్స్ వద్దకు వెళ్లడం అక్కడ పనికి చేరడం జరిగింది. అక్కడ ఉన్నపుడు ఇంట్లోనే ఉంటూ పరుచూరి బ్రదర్స్ కి సేవలను చేస్తూ రైటర్ గా మెలకువలు నర్చుకుంటున్న సమయంలో మంచి శిష్యుడుగా మెలుగుతున్న సమయంలో ఒక కొత్త హీరో తమ్ముడు ఒక అమ్మాయిని లేపుకువచ్చి పెళ్లి చేసుకోడానికి పోసాని వద్దకు సహాయం కోస వస్తే పోసాని తన రూమ్ లో ఆశ్రయం ఇచ్చాడట.

ఈ వార్త పరుచూరి గోపాల కృష్ణ భార్య విజయలక్ష్మి గారికి ఎవరో తప్పుగా చెప్పడంతో రూమ్ కి అమ్మాయిని తెచ్చుకున్నాడనే అనుమానంతో పోసాని ని బాగా తిట్టి అక్కడి నుండి పంపించేశారట. నిందతో అక్కడినుండి వెళ్ళవలసి రావడం, తనకు వివరణ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదనే కోపంతో విజయలక్ష్మి గారిని పొడవడానికి ఒక కత్తి కూడా కొని కొద్ది రోజులు ఆ ఇంటి వద్ద తిరిగాడట. ఆవేశం చల్లారాక ఆ నిర్ణయం మానుకున్నాడట పోసాని. ఈ విషయాలన్నింటిని అనలిస్ట్ దాము బాలాజీ గారు పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago