Analyst Damu Balaji : పవన్ హీరోనా.. జీరోనా… పిఠాపురం పవన్ కళ్యాణ్ సభ పై జనం రియాక్షన్ ఏంటి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : జనసేన అధినేత పిఠాపురంలో ఇచ్చిన స్పీచ్ ను జనసైనికులు ఉహించి ఉండకపోవచ్చు. ఇప్పటివరకు తనకు అధికారం ఇవ్వమని కానీ సీఎం ని చేయండి అని కానీ ఎపుడూ అనని జనసేనాని మొదటి సారి నమ్మెను సీఎం ని చేయండి ప్లీజ్ అంటూ జనాలను కోరుకున్నారు. దోపిడీ దారులకు సీఎం సీటు ఇస్తే ఇలానే దోపిడీ చేస్తుంటారని, నేను బతికుండగా అలాంటి వారికి పదవి రాకుండా చేస్తానంటూ మాటిచ్చారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఏపీ ని నెంబర్ వన్ చేస్తా దేశంలోనే అంటూ ప్రకటించారు. వారాహి యాత్రలో భాగంగా పిఠాపురంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ జనసైనికులలో నూతనోత్సహం నింపారు. అయితే పవన్ పిఠాపురం స్పీచ్ రాజకీయ వర్గాల స్పందన ఏమిటి, చివరికి పవన్ ఓపెన్ అప్ అయ్యాడా అనే విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జనం రియాక్షన్ ఏమిటి… పవన్ క్లారిటీతో ఉన్నాడా…

అనలిస్ట్ దాము బాలాజీ పవన్ కళ్యాణ్ వ్యూహల గురించి మాట్లాడుతూ ఆయన మొదటి నుండి క్లారిటీ గానే ఉన్నారు. కానీ ఆయన గురించి మొదటి నుండి ఇతర పక్షాలు కన్ఫ్యూస్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఆయనకు సీఎం పదవి ఆశించలేదని కేవలం చంద్రబాబు ఎలా చెబితే అలా వింటున్నారంటూ మాట్లాడారు. కానీ ఆయన పిఠాపురం సభ అలాంటి వారికి సమాధానం ఇచ్చింది. అంతకు ముందు పవన్ ఇతర సభలలో మాట్లాడినపుడు కూడా నాకు మీరు ఒక ముప్పై సీట్లు ఇచ్చినా నేను టీడీపీ దగ్గర డిమాండ్ పెట్టేవాడిని ఆ ఆప్షన్స్ లేకుండా చేసారు అంటూ చెప్పారు, ఇప్పుడు నేను సీఎం అభ్యర్థిని అంటూ చెప్పారు.

ఇక జగన్ అధికారంలోకి రాకుండా ఎలాగైనా చేస్తానని దోపిడీ దారులకు అధికారం దక్కనివ్వనని చెప్పారు. ఎవరికీ భయపడను అంటూ చాలా ఉద్వేగంగా మాట్లాడారు అంటూ చెప్పారు బాలాజీ. నిజానికి పవన్ మొదటి నుండి క్లియర్ గానే ఉన్నాడు కాకపోతే ప్రత్యర్థులను కన్ఫ్యూస్ చేసారు అంతే అంటూ చెప్పారు బాలాజీ. ఇక ఇప్పుడు కూడా వారాహి యాత్ర ద్వారా తన బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులలో తన బలం తెలియాలని ఎంతలా ప్రభావితం చేయగలనో చూపిస్తున్నాడు అంటూ బాలాజీ తెలిపారు. జనం కూడా జనసేనాని నుండి కోరుకునే క్లారిటీ ఇదేనంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago