Featured

Analyst Damu Balaji : వివేకానంద కేసులో సునీతకి అనుకూలంగా సుప్రీమ్ కోర్టు తీర్పు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏమాత్రం పురోగతి కనిపించకపోయినా కేవలం రాజకీయంగా మాత్రం అటు వైసీపీ ఇటు టీడీపీ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలకు పనికొస్తోంది. ఒకవైపు సునీత రెడ్డిని అడ్డం పెట్టుకుని టీడీపీ వివేకానంద రెడ్డి కేసును వాడుకుంటోందని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటే మరోవైపు జగన్ సొంత బాబాయ్ ని హత్య చేయించాడు అంటూ టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు ఎపుడు తెలుస్తాయో తెలియదు కానీ ఎవరికి వారు కోర్టులను, సిబిఐ వంటి వ్యవస్థలను విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు. సిబిఐ అధికారుల విచారణను కొంతమంది తప్పు పడుతుంటే ప్రభుత్వంకి అనుకూలంగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల విమర్శల నడుమ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత రెడ్డి గారు ఈ కేసు విషయమై సుప్రీం తలుపు తట్టారు. ఈ విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషణ అందించారు.

సునీత పిటిషన్ ను అంగీకరించిన సుప్రీం కోర్టు…

మొదటి నుండి వివేకానంద కేసులో సునీత దూకుడుగా వ్యవహారిస్తోంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఆమె సిబిఐ కంటే ముందుగా కేసు విషయంలో ఉంటోందని నిందితులు ఎవరు బెయిల్ కి అప్లై చేసినా వెంటనే ఇంప్లీడ్ అవుతూ అడ్డుకుంటోందని తెలిపారు. తాజాగా సుప్రీం కోర్టులో సిబిఐ న్యాయవాదులకు సహాయం చేయడానికి తమ న్యాయవాదులు పనిచేస్తారని అందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు సునీత రెడ్డి.

ఇప్పటికే సిబిఐ సునీతకి అనుకూలంగా పనిచేస్తోందని విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక ఇప్పుడు సిబిఐకి సునీత న్యాయవదులు సహాయం చేయొచ్చని సుప్రీం తీర్పు ఇచ్చింది. అయితే సునీత తన న్యాయవదులకు అలాగే సిబిఐ న్యాయవాదుల ఖర్చులు తానే భరిస్తోందని అవన్నీ టీడీపీ పార్టీ నుండి అలాగే ఎంపీ రఘు రామ కృష్ణం రాజు నుండి సహాయం అందుతోందని బయట ప్రచారం జరుగుతోందని బాలాజీ తెలిపారు. ఎంపీ రఘు రామ కృష్ణం రాజు వెనుక ఉండి సునీత విషయంలో అన్నీ చూసుకుంటున్నారంటూ బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago