Analyst Damu Balaji : మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా ఆయన చెల్లిగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా భోళా శంకర్ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయినా రోజు కలక్షన్స్ పర్వాలేదానిపించిన మరుసటి రోజు నుండి వసూళ్లు రాబట్టడంలో వెనుక బడింది. సినిమా తమిళ సినిమాకు రీమేక్ అయినా సినిమా మెగాస్టార్ అభిమానులకు ఏమాత్రం నచకపోవడం వల్ల సినిమా ప్లాప్ అయింది. మెహర్ రమేష్ తీసిన కొన్ని సినిమాలలో ఇది కూడా ప్లాప్ గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా ప్లాప్ అవడం గురించి మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు .
సినిమా ప్లాప్ అవడానికి తమిళ దర్శకుడే కారణం….
చిరంజీవి సినిమాలాగా భోళా శంకర్ సినిమా అసలు లేదంటూ అభిమానులు మెహర్ రమేష్ మీద మండిపడుతుంటే ఆయన మాత్రం ప్లాప్ కి కారణం నేను కాదు తమిళ దర్శకుడే అంటూ శివ మీదకు తప్పును నెట్టేసారంటు వస్తున్న వార్తల మీద దాము బాలాజీ మాట్లాడుతూ మెహర్ రమేష్ తన కెరీర్ లో తీసిన సినిమాలలో వీర కన్నడిగా పునీత్ రాజ్ కుమార్ హీరోగా ఆంధ్రవాలా రీమేక్ హిట్ అయింది.
ఇక ప్రభాస్ తో బిల్లా సినిమా చేసి ఓకే అనిపించాడు అది డాన్ సినిమాకు రీమేక్. ఇక సొంత సినిమాలు శాడో, శక్తి భారీ డిజైస్టర్లు కాగా శక్తి సినిమా ఫ్లాప్ కు అశ్విని దత్త్ కారణం అంటూ అప్పట్లో మెహర్ రమేష్ కామెంట్స్ చేసాడు. ఇక ఇపుడు భోళా శంకర్ తమిళ రీమేక్ కాగా ఆ సినిమా తీసిన డైరెక్టర్ మీదకు తప్పును నెడుతున్నాడు. నిజానికి ఆ సినిమా ఎలా ఉందొ అలా తీసుంటే సినిమా హిట్ అయ్యుండేది. అలా కాకుండా మధ్యలో కొంత మార్చడం వల్లే సినిమా ప్లాప్ అయి కూర్చుంది అంటూ బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…