Analyst Damu Balaji : రక్తం తుడిచింది ఎవరంటే… వివేకానంద హత్య కేసులో సీఐ శంకరయ్య ఏమన్నాడంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరువ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంతు విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ, వివేకానంద రెడ్డి చెల్లి విమలా రెడ్డి పరామర్శించారు. ఇక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన హై కోర్ట్ తీర్పును రిజర్వు చేసి పెట్టింది. అయితే మరోసారి కేసులో సీఐ శంకరయ్య నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కీలకం అయిందంటూ అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

మాట మార్చిన సీఐ శంకరయ్య…

2019 లో వివేకానంద హత్య జరిగినపుడు కడప లో సీఐ గా ఉన్న శంకరయ్య గారు చెప్పిన వివరాల ప్రకారం హత్య జరిగాక సమాచారం తెలిసి అక్కడికి వెళ్లే సమయానికి అక్కడ భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తదితరులు ఉన్నారని, బాత్రూంలో కమోడ్ తగిలి తలకు గాయం అయిందని ఆయన వాంతి చేసుకోవడం వల్ల క్లీన్ చేయిస్తున్నామని చెప్పారంతు పేర్కొన్నారంటూ బాలాజీ తెలిపారు. ఇక ఫ్రీజర్ తెప్పించి శవం పెట్టించింది కూడా వాళ్లేనని, నేను ఏం చేయాలన్నా అక్కడ అప్పటికే జనం బాగా చేరడం వల్ల నా చేత కాలేదంటూ శంకరయ్య పేర్కొన్నారని బాలాజీ అభిప్రాయపడ్డారు.

అయితే కేసు దర్యాప్తు సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం శంకరయ్య ను సస్పెండ్ చేయగా మళ్ళీ ఎన్నికైన వైసీపీ ప్రభుత్వం శంకరయ్య కి ప్రొమోషన్ ఇవ్వడం జరిగింది. ఇక అప్పుడు మరోసారి సిబిఐ విచారణలో శంకరయ్య ఇచ్చిన స్టేట్మెంట్ మారిపోయిందంటూ అనలిస్ట్ బాలాజీ తెలిపారు. ఆయన అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒత్తిడి మూలంగా అలా మాట్లాడానంటూ చెప్పారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయనను విచారించగా మరోసారి సమాధానం మారుస్తూ ఒత్తిడి ఉందంటూ చెప్పడం జరిగిందని బాలాజీ తెలిపారు. ఈ హత్య రాజకీయ హత్య అంటూ మాట్లాడటం జరిగిందని పేర్కొన్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago