Featured

Analyst Damu Balaji : వివేకానంద హత్య కేసులో కోర్టులో ఆరుగురు నిందితులు ఏం చెప్పారంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏమాత్రం పురోగతి కనిపించకపోయినా కేవలం రాజకీయంగా మాత్రం అటు వైసీపీ ఇటు టీడీపీ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలకు పనికొస్తోంది. ఒకవైపు సునీత రెడ్డిని అడ్డం పెట్టుకుని టీడీపీ వివేకానంద రెడ్డి కేసును వాడుకుంటోందని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటే మరోవైపు జగన్ సొంత బాబాయ్ ని హత్య చేయించాడు అంటూ టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు ఎపుడు తెలుస్తాయో తెలియదు కానీ ఎవరికి వారు కోర్టులను, సిబిఐ వంటి వ్యవస్థలను విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు. సిబిఐ అధికారుల విచారణను కొంతమంది తప్పు పడుతుంటే ప్రభుత్వంకి అనుకూలంగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల విమర్శల నడుమ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత రెడ్డి గారు ఈ కేసు విషయమై సుప్రీం తలుపు తట్టారు. ఈ విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషణ అందించారు.

కోర్టులో హాజరైన 6 మంది నిందితులు…

వివేకానంద హత్య కేసులో ఇప్పటికే ఏడుగురు అరెస్టు కాగా ఏ8 గా ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారంటూ బాలాజీ తెలిపారు. ఏ1 దస్తగిరి వాంగ్మూలం ప్రకారం ఎర్ర గంగిరెడ్డి వివేకానంద చేసిన సెటిల్మెంట్ లో తనకిస్తానన్న ఎనిమిది కోట్లు ఇవ్వనందున హత్య చేయడానికి పిలిచినట్లు తెలిపాడు. తనకు 5 కోట్లు ఆఫర్ చేయగా అందులో అడ్వాన్స్ గా కోటి ఇవ్వగా 25 లక్ష రూపాయలు సునీల్ యాదవ్ తీసుకోగా మిగిలిన 75 లక్షలను మున్నా అనే స్నేహితుడి వద్ద ఉంచినట్లు తెలిపారు దస్తగిరి.

ఎర్ర గంగిరెడ్డికి, దేవిరెడ్డి ఉమా శంకర్ రెడ్డి సుపారీ ఇవ్వగా దేవిరెడ్డి ఉమా శంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మనిషి అంటూ సిబిఐ ఇప్పటికే నిందితులుగా వీరిని ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు. ప్రతి వాయిదా సమయంలో ను జైలులో ఉన్న నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, పోలీసులు వారితో కఠినంగా ప్రవర్తించారా వంటి విషయాలను జడ్జ్ అడిగి తెలుసుకుంటారని అందువాళ్ళ కేసు వాయిదా ఎపుడు ఉన్నా ఈ నిందితులంతా కోర్టుకు హాజరవుతారని బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago