Analyst Zakeer : రంగారెడ్డి జిల్లా అధిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమందితో వచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తొలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డి కి అంతకుముందు చాలానే జరిగిందని బయట ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఇష్యూలో మాత్రం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ అసలు నిజానిజాలు ఏంటి అన్న ఆసక్తి అందరికీ కలుగుతోంది.
నవీన్, వైశాలి లో ఎవరు ఆపద్దం చెబుతున్నారు…
ఇక ఇష్యూ మీద ప్రముఖ అనలిస్ట్ జాకీర్ గారు మాట్లాడుతూ నవీన్ కథనం ప్రకారం వైశాలి తో అతను ఆల్రడీ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలను రహస్యంగా ఉంచాలని వైశాలి షరతు పెట్టిందంటూ నవీన్ పేర్కొన్నాడు. వారి పెళ్లిని వైశాలి చదువు అయిపోయేవరకు రహస్యంగా ఉంచాలని అనుకున్నట్లు తెలిపాడు. ఇక తన భార్యను తాను తీసుకెళ్లానంటూ నవీన్ చెబుతుండగా నవీన్ రెడ్డి తల్లి మాట్లాడుతూ నా కొడుకు అలా చేసి ఉండకూడదు అది తప్పే కానీ ఆ అమ్మాయిని ప్రేమించడం వాళ్ళు కలిసి తిరగడం ఇవన్నీ నిజాలు. వైశాలి తల్లిదండ్రులు కూడా పెళ్ళికి మొదట అంగీకరించారు అంటూ మాట్లాడారు.
ఈ విషయాల గురించి జాకీర్ గారు మాట్లాడుతూ వీరు చెబుతున్న విషయాల్లో అపద్ధం కట్టుకతలు కనిపించడం లేదు అయితే బయట వినిపిస్తున్న మరో ప్రచారం నవీన్ రెడ్డి రెండు టీ బ్రాంచెస్ ను వైశాలి తండ్రి నారాయణ రెడ్డి పేరున పెట్టడానికి అలాగే ఖరీదైన వోల్వో కారును వైశాలి పేరు మీద పెట్టాడంటూ వినిపిస్తున్న నేపథ్యంలో జాకీర్ మాట్లాడుతూ వైశాలి మీడియా ముందుకు వచ్చి వివరిస్తే కానీ అసలు నిజాలు బయటికి రావు. లేదా నవీన్ వారి పెళ్ళికి సంబంధిచిన ఫోటోలను బయటపెట్టాలంటూ అభిప్రాయపడ్డారు. ఇద్దరిలో నవీన్ చెబుతున్న విషయాలు నమ్మదగినవిగా ఉన్నాయంటూ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…