Categories: FeaturedMovie News

Actress Asmitha : పిల్లలు కనకపోవడానికి కారణం అదే.. అందం పోతుందని కాదు.. ప్రతి అమ్మాయికి అమ్మ అవ్వాలని ఉండదు : నటి అస్మిత

Actress Asmitha : ఈటీవీ లో వచ్చిన ‘పద్మవ్యూహం’ సీరియల్ ద్వారా నటిగా మారిన ఆశ్మిత సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఎక్కువగా సీరియల్స్ తో గుర్తింపు పొందిన అస్మిత మా టీవిలో ప్రసారమయ్యే ‘అగ్నిసాక్షి’ సీరియల్ ద్వారా విలన్ గా కూడా బాగా నటించి ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా యూత్ కి బ్యూటీ టిప్స్ చెబుతూ మంచి ఫాలోయింగ్ తో ఉన్న అస్మిత పెళ్లి తరువాత యాక్టింగ్ కు దూరంగా ఉంది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి అలానే చాలా మంది తనను ట్రోల్స్ చేస్తున్న విషయాల్లో క్లారిటీ ఇచ్చారు అస్మిత.

పిల్లలు కనకపోవాడనికి కారణం అదే…

పెళ్లి అయ్యేవరకు ఒక అమ్మాయి కైనా అబ్బాయి కైనా ఎదురయ్యే ప్రశ్న వయసు దాటిపోతోంది పెళ్లి చేసుకో అని. ఇక పెళ్లయ్యాక ఇంకా పిల్లల్ని కనలేదా అనే ప్రశ్నలు సమాజం నుండి ఎదురవుతూనే ఉంటాయి. పిల్లలు కనడం అనేది పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరి వ్యక్తిగత ఛాయిస్ ఎపుడు కనాలి, అసలు పిల్లల్ని కనాలా వద్దా అన్నది వాళ్ళ వ్యక్తిగతం అంటూ అస్మిత తన ఆలోచనలను తెలిపారు. తనను చాలా మంది ఈ విషయం అడిగారంటూ తెలిపింది అస్మిత. ఎపుడు పిల్లలని కంటారు అనే ప్రశ్న చాలా సార్లు ఎదురైంది, అది కూడా ఆడవాళ్ళ నుండే ఎక్కువగా ఎదురైంది.

ఇంకొంతమంది అందం పోతుందని పిల్లల్ని కానకుండా ఉన్నావా అంటూ ప్రశ్నినిస్తున్నారు అంటూ ఈ ప్రశ్నలన్నిటికీ క్లారిటీ ఇచ్చారు. ప్రతి అమ్మాయి అమ్మ అవ్వాలని అనుకోదు అంటూ చెప్పారు. ఎవరి కారణలు వాళ్లకు ఉంటాయి. మా పెళ్లి విషయంలో కూడా ఇలానే మాట్లాడారు. కానీ మేము చేసుకోవాలి అనుకున్నపుడే చేసుకున్నాం, అలానే పిల్లల్ని కానాలనుకున్నపుడే కంటాం. మా జీవితాన్ని మేమిద్దరం ప్రస్తుతం సంతోషంగా గడుపుతున్నాం,ఇంకా కొంతకాలం ఇలానే ఉండాలని అనుకుంటున్నాం. ఒకవేళ భవిష్యత్ లో పిల్లలు లేకపోయినా మేము సంతోషంగానే ఉంటాం అంటూ అస్మిత తన అభిప్రాయాలని తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago