Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.ఇలా బుల్లితెరకు దూరంగా ఉన్నటువంటి అనసూయ వెండితెరపై మాత్రం వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతో ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ అభిమానులతో ఫైట్ చేస్తున్నారు. అందుకు గల కారణం విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ అనసూయ కామెంట్లు చేయడమేనని చెప్పాలి. గతంలో కూడా అనసూయ విజయ్ దేవరకొండ సినిమా పట్ల చేసినటువంటి కామెంట్స్ కారణంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్ గురించి అనసూయ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.ఇలా అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండ అభిమానులకు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఇలా విజయ్ దేవరకొండ అభిమానులను గెలికిన అనసూయ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి జిమ్ లోభారీగా వర్కౌట్ చేస్తూ తెగ కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు షేర్ చేయడానికిరెండు రోజుల ముందు విజయ్ దేవరకొండ గురించి కాంట్రవర్సీట్వీట్ చేసిన ఈమె ఇప్పుడు ఈ ఫోటోలను షేర్ చేయడంతో కేవలం అటెన్షన్ కోసమే అనసూయ ఇలా చేస్తున్నారంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…