Miheeka: రానా మిహిక దంపతుల గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్లయిన తర్వాత వీరిద్దరు సంతోషంగా ఉన్నప్పటికీ విడాకులు తీసుకొని విడిపోబోతున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు మీహిక ఖండిస్తూ వస్తున్నారు.అయితే వీరిద్దరూ పిల్లల్ని ప్లాన్ చేయకపోవడంతో పిల్లల గురించి కూడా ఎన్నో వార్తలు వచ్చాయి మిహికా ప్రెగ్నెంట్ అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక గత రెండు రోజులుగా వీరిద్దరూ అనాధ పిల్లలను దత్తత తీసుకోబోతున్నారని వార్త కూడా హల్చల్ చేస్తుంది.
ఇక గత కొద్దిరోజుల క్రితం రానా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మరి కొద్ది రోజులలో మిహికా నుంచి మీకు సర్ప్రైజ్ రాబోతుంది అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఆ సర్ప్రైజ్ ఏంటి అని అభిమానులు ఆలోచనలో పడ్డారు బహుశా రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మిహిక ప్రెగ్నెంట్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ విధంగా రానాదంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం వైరల్ కావడంతో తాజాగా ఈ వార్తలపై మిహిక స్పందించారు.పెళ్లి తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను రానా నా నుంచి సర్ప్రైజ్ రాబోతుంది అంటూ ఎందుకు చెప్పారో రానా గారిని అడగాలని తెలిపారు. ఇక తాను ప్రెగ్నెంట్ అయితే అసలు కాదని, ప్రస్తుతం నేను సంతోషంగా ఉండడంతో కాస్త బొద్దుగా తయారయ్యానని తెలిపారు.
ఒకవేళ నేను కనుక ప్రెగ్నెంట్ అయితే ఈ గుడ్ న్యూస్ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటానని ప్రస్తుతం అయితే ఈ వార్తలన్నీ ఆ వాస్తవం అంటూ మిహిక ప్రెగ్నెన్సీ రూమర్ల గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. పెళ్లికి ముందే ఆమెకు డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో అనే ఇంటీరియర్ డెకరేషన్ కంపెనీ ఉంది. మిహీకా ఏమాత్రం సినీరంగానికి సంబంధం లేని వ్యక్తి అనే విషయం మనకు తెలిసిందే.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…