Movie News

ఆయన అలవాట్లతో ఆస్తి మొత్తం పోయింది : అనసూయ

బుల్లితెర ఫిమేల్ యాంకర్స్ లో జబర్దస్త్ బ్యూటీ అనసూయకు స్పెషల్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు.. ఆకర్షించే అందంతోపాటు అద్బుతమైన ప్రతిభ ఆమె సొంతం. టెలివిజన్ స్క్రీన్ పై తనదైన ముద్రవేసిన అనసూయ.. ఇప్పుడు వెండితెరపైనా తన టాలెంట్ చూపిస్తోంది. క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్లతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో అలరిస్తోంది.

అయితే.. ఇంత స్టార్ డమ్ రాత్రికి రాత్రే వచ్చింది కాదు. ఎన్నో కష్టాలు, మరెన్నో ఇబ్బందులతోనే అనసూయ సినీ ప్రయాణం మొదలైంది. తెలుగు అమ్మాయైన అనసూయ ఎంబీఏ పూర్తి చేసి, మొదట్లో స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత జాబ్ కు ఫుల్ స్టాప్ పెట్టి.. యాక్టింగ్ వైపు అడుగులు వేసింది.ఓ న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న క్రమంలోనే అనసూయకు ‘జబర్దస్త్’ ఆఫర్ వచ్చింది. ఈ కామెడీ షోతో వచ్చిన పాపులారిటీని సరిగ్గా ఉపయోగించుకున్న అనసూయ.. సినిమా అవకాశాలనూ అందుకుంది.

‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘కథనం’ వంటి సినిమాలతో సత్తాచాటింది. ఇప్పుడు.. దాదాపు అరడజను సినిమాలు చేతిలో ఉన్న ఈ బ్యూటీ.. కరోనా గోల లేకుంటే దాదా మూడ్నాలుగు సినిమాలతో ఇప్పటికే సందడి చేసేది.అయితే.. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలను వెల్లడించింది. ఫ్లాష్ బ్యాక్ లో వీళ్లది రాయల్ ఫ్యామిలీ అంట. చాలా ఆస్తులు ఉండేవని, తమ ఇంట్లో గుర్రాలు కూడా ఉండేవని చెప్పింది.

ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదని వెల్లడించింది అనూ.అయితే.. తన తండ్రికి ఉన్న చెడు అలవాట్ల వల్లనే ఆస్తి మొత్తం పోయిందని చెప్పింది. వాళ్ల నాన్నకు గుర్రపు స్వారీలు, గ్యాంబ్లింగ్ వంటి హ్యాబిట్స్ ఉండేవట. వాటి ద్వారానే ఆస్తి మొత్తం కోల్పోవాల్సి వచ్చిందట. దీంతో.. వాళ్ల కుటుంబ పరిస్థితి మొత్తం మారిపోయిందట. తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లో బస్సు టికెట్ కు సైతం డబ్బులు లేకపోతే.. నడుచుకుంటూ వెళ్లేదట..కానీ ఇప్పుడు మాత్రం తమ పరిస్థితి మెరుగుపడిందను చెప్పుకొచ్చింది అనసూయ…!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago