Anasuya: అనసూయ ప్రస్తుతం బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన పర్ఫామెన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను అదరగొడుతున్నారు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఈమె గర్ల్స్ టీం తరపున లీడర్ గా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ కూడా హాజరవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ప్రసారమైన ఈ కార్యక్రమం ఎన్నో రకాల ట్రోల్స్ ఎదుర్కొంది. ఇక ఈ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరొక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా అనసూయ ఈసారి లెక్చరర్ అవతారంలో కనిపించారు.
రెడ్ చిల్లిలా ఎరుపు రంగు చీర కట్టుకొని చాలా ఘాటుగా తన అంద చందాలను ఆరబోస్తూ కనిపించారు. ఇక ఈమె లెక్చరర్ గా నటించగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వారంతా స్టూడెంట్ గా సందడి చేశారు. ఇక ఇంత అందమైన లెక్చరర్స్ వస్తే స్టూడెంట్స్ చిలిపి కామెంట్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.
రేటింగ్ తంటాలు..
ఈ క్రమంలోనే స్టూడెంట్ గా ఉన్నటువంటి సెలెబ్రిటీలందరూ కూడా ఈమెను రొమాంటిక్ కామెంట్లతో తనపై పొగడ్తల వర్షం కురిపించారు. బెండకాయ దొండకాయ అనసూయ మేడం నా గుండెకాయ అంటూ ఈమెపై కామెంట్లు చేయగా అనసూయ మాత్రం తెగ సిగ్గుపడుతూ కనిపించారు. ఈ ప్రోమో వైరల్ గా మారడంతో ఇదంతా కూడా రేటింగ్ కోసమేగా అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…