Anasuya Bharadwaj: బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైన సమయంలో యాంకర్ గా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ ఈ పాపులారిటీతో సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి అనసూయ ఏ ఇతర ఛానల్లోనూ ఇతర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించలేదు. అయితే తాజాగా ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు రావడమే కాకుండా ఇతర బుల్లితెర చానల్స్ లో కూడా యాంకర్ గా ఎందుకు వ్యవహరించలేదో తెలియజేశారు.
సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల రేటింగ్స్ కోసం పెద్ద ఎత్తున నిర్వాహకులకు అవమానకర చెత్త టీఆర్పీ స్టెంట్స్ కు పాల్పడతారు.. టెలివిజన్ షోలలో ఇలాంటి వాతావరణం ఎప్పుడైతే ఉండదో తిరిగి అప్పుడే యాంకరింగ్ మొదలు పెడతానని ఈమె తెలియజేశారు. షో రేటింగ్ కోసం వారు చెప్పిన చెత్త పని చేయాల్సి ఉంటుందని ఈమె చెప్పకనే చెప్పేశారు.
ఇలా వారు చెప్పే పనులన్నింటినీ తాను చేయలేక ఈ బుల్లితెర కార్యక్రమాల నుంచి తాను తప్పుకున్నానని ఈ సందర్భంగా అనసూయ పరోక్షంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…