Movie News

Ramcharan: హాలీవుడ్ సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్… సంతోషంలో మెగా ఫ్యాన్స్?

Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా అమెరికాలో ఉన్నారు.

రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో నిలవడంతో పెద్ద ఎత్తున అమెరికాలో చిత్ర బృందం పర్యటిస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అమెరికాలోని మీడియా టాక్ ఈసీ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

గతంలో ఈయన హాలీవుడ్ సినిమాలలో నటించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోని తాజాగా ఈ మీడియా సమావేశంలో మరోసారి ఈయన హాలీవుడ్ ఎంట్రీ గురించి పలు విషయాలను తెలియజేశారు.ఇప్పటికే పలు స్టూడియోలతో సంప్రదింపులు జరుగుతున్నాయని మరో కొద్ది రోజులలో ఓ గుడ్ న్యూస్ రాబోతుంది అంటూ రాంచరణ్ వెల్లడించారు.

Ramcharan: హాలీవుడ్ ఎంట్రీ పక్కా

ఇలా కొద్ది రోజులలో గుడ్ న్యూస్ రాబోతుందనీ రామ్ చరణ్ చెప్పడంతో ఈయన హాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో తమ అభిమాన హీరో హాలీవుడ్ సినిమాలలో నటించే స్థాయికి ఎదగారని తెలిసి మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago