Anchor Lasya: తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ రవితో కలిసి ఈమె ఇండస్ట్రీకి వ్యాఖ్యాతగా పరిచయమయ్యారు. ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత లాస్య యాంకరింగ్ కు దూరమయ్యారు.అడపాదడపా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నటువంటి ఈమె తిరిగి బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన లాస్య నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను వీడియోల ద్వారా అభిమానులతో పంచుకునేవారు.
ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి లాస్య దంపతులు ఇదివరకే దక్షిత్ అనే ఓ కుమారుడికి జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. తన కుమారుడితో కలిసి ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసినటువంటి లాస్య మరోసారి గర్భవతి అనే విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఇలా తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఈమె తెలియజేస్తూ ఉన్నారు. అయితే తాజాగా తనకు మరో బిడ్డ జన్మించారని ఈమె హోలీ పండుగ సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇలా తాను మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఈమె ఒక వీడియో రూపంలో తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఇతర సెలబ్రిటీలు లాస్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…