Anasuya: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది. అయితే పొత్తులో భాగంగా 21 స్థానాలలో పోటీ చేయగా 21 స్థానాలలో అఖండమైన విజయాన్ని సాధించింది.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో ఇప్పటికే సినిమా సెలబ్రిటీలు మొత్తం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే యాంకర్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అయినటువంటి అనసూయ ఎప్పుడు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు ఆమె కేవలం తన కెరియర్ అలాగే ఫ్యామిలీతోనే తన సమయం గడుపుతున్నారు.
ఇలా రాజకీయాలకు దూరంగా ఉన్న అనసూయ పవన్ కళ్యాణ్ గెలుపు గురించి సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ తన భార్య కుమారుడితో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు అక్కడ ఆయనకు మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఘనస్వాగతం పలికారు.
ఇది ఆరంభం మాత్రమే..
పవన్ రాగానే తన అన్నయ్య తల్లి వదిన కాళ్లపై నమస్కారం చేశారు. ఇక రామ్ చరణ్ సైతం పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడమే కాకుండా ఆయనకు నమస్కారం చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాగా అనసూయ సైతం ఈ ఫోటోలను షేర్ చేస్తూ..ఇది కేవలం ఆరంభం మాత్రమే.. నాయకుడు వచ్చాడు.. పవర్ లో పవర్ స్టార్ అంటూ అనసూయ పోస్ట్ చేసింది. ఇది నిజమైన ప్రేమ అంటూ చిరంజీవి, పవన్ మధ్య అనుబంధం గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…