Featured

Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?

Anchor Anasuya: ఈటీవీ మల్లెమాల వారు నిర్వహించిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, క్యాష్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పలు రకాల షోలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. అప్పుడప్పుడు పండుగ సమయాలలో ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇకపోతే మల్లే మాల వారు నిర్వహించే కార్యక్రమాలు అన్నీ కూడా దాదాపుగా సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా ఒక ఈవెంట్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.

Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?

ఏప్రిల్ 10వ తేదీన శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా మల్లెమాల వారు మరొక ఈవెంట్ ను ప్లాన్ చేశారు. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అనే ఒక ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు యాంకర్ ప్రదీప్, అనసూయలతో పాటుగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్స్ అందరూ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఇటీవలే ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు.

Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?

అయితే ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ ప్రోమోలో అనసూయ ఒక చిన్నారిని ఎత్తుకుని ఎమోషనల్ గా ముద్దాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. అయితే అనసూయకు ఇద్దరు కొడుకులు అన్న విషయం అందరికి తెలిసిందే. ఆమెకు ఒక బిడ్డ లేదు అనే బాధ ఎప్పుడూ ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంది అనసూయ. అంతేకాకుండా తన బిడ్డ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నామని కూడా చెప్పుకొచ్చింది. తాజాగా వదిలిన ప్రోమోలో అనసూయ ఒక చిన్నారిని ఎత్తుకోవడంతో పాటు ముద్దులు పెడుతూ ఎమోషనల్ గా ఆప్యాయంగా మనసుకు హత్తుకుంది.

అనసూయ కల నెరవేరిందా…

దీంతో అనసూయ ఎత్తుకున్న ఆ పాప ఎవరు అన్న చర్చ మొదలయింది. దీంతో చాలామంది ఆ పాపను అనసూయ దత్తత తీసుకుందా? అందుకే స్టేజ్ పై అంత ఎమోషనల్ అయ్యిందా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి అనసూయ చేతిలో ఉన్న ఆ పాప ఎవరు?సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం నిజంగానే అనసూయ దత్తత తీసుకుందా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మరొకవైపు అనసూయ చెప్పిన మాట ప్రకారం అనసూయ మరొక బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారా అనే చర్చలు మొదలయ్యాయి. అంటే త్వరలోనే అనసూయ గుడ్ న్యూస్ చెప్పబోతోందనే రీతిలో కూడా ఆలోచిస్తున్నారు. అనసూయ తనకు బిడ్డ కావాలి అని కోరుకుంటున్నానని అనడంతో అక్కడే ఉన్న యాంకర్ ప్రదీప్ తథాస్తు అని దీవించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతేకాకుండా అనసూయ మాట్లాడిన మాటలకు, ఆమె ఎత్తుకున్న చిన్నారి ఎవరు ఈ విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago