Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ అనంతరం రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై ఈమె నటనకు మంచి గుర్తింపు రావడంతో వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం వెండితెరకి పరిమితమయ్యారు.
ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. అయితే తనని ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం వారికి తన స్థాయిలో వార్నింగ్ ఇస్తూ అనసూయ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.
ఇలా ఏ విషయం అయినా సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకునే అనసూయ తాజాగా ఒక ఎయిర్ లైన్ సంస్థ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇండిగో విమానయాన సంస్థ పై , సిబ్బంది వ్యవహార శైలిపై అనసూయ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఇండిగో ఎయిర్ లైన్స్ ను ద్వేషిస్తున్నాను. ఇక్కడ దేశీయ ఎయిర్ లైన్స్ వారు ఆధిపత్యం చెలాయించడం విచారకరం. అసలు నాణ్యతలేని సేవలు అంటూ ఈమె విమానయాల సంస్థపై అలాగే సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ చేశారు. అయితే ఈమె ఇలాంటి పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటి ఏ విషయంలో ఈమె అసౌకర్యంగా ఫీల్ అయ్యారు అనేది మాత్రం వెల్లడించలేదు మరి ఈమె చేసినటువంటి పోస్టుకు ఇండిగో నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో తెలియాల్సి ఉంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…