Upasana: ఉపాసన పరిచయం అవసరం లేని పేరు మెగా కోడలుగా మెగా ఇంటి గౌరవాన్ని ప్రతిష్టను కాపాడుతూ కోడలుగా ఎంతో గుర్తింపు పొందారు.రామ్ చరణ్ సతీమణిగా మాత్రమే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందారు.
ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రశంసలు అందుకున్నటువంటి ఉపాసన తాజాగా మరొక మంచి పని చేస్తూ అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే.అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఉపాసన తాజాగా హైదరాబాద్లో జోయా జువెలర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నగల షోరూం ప్రారంభించిన ఉపాసన మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఈ షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తనకు ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ ఈమె దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ కు విరాళంగా అందించారు. ఇక ఈ విషయం గురించి ఉపాసన తెలియజేస్తూ తాను జోయ జ్యువెలర్స్ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
ఇక ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనని అతిథిగా ఆహ్వానించినందుకు ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా సాధికారతను అందించే లక్ష్యంతో దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు మద్దతునిస్తున్నాయి. అందుకు తన వంతు సహాయంగా ఈ సంపాదన మొత్తం ట్రస్టుకు విరాళంగా అందిస్తున్నానని తెలియజేయడంతో పలువురు ఈమె మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…