Anchor Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా ఈమెకు వరుస సినిమా అవకాశాలు రావడంతో ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.
ఇకపోతే అనసూయ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఈమె మెగాస్టార్ చిరంజీవినీ జైలుకు పంపించే ఒక రిపోర్టర్ పాత్రలో నటించారు. ఈ పాత్రకు ఎంతో మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీరు గాడ్ ఫాదర్ సినిమాలో మంచి పాత్రలో నటించిన సినిమా ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉన్నారు అని ప్రశ్నించారు.
ఇలా సినిమా ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉన్నారు అని ప్రశ్నించగా అనసూయ చాలా సిల్లీ రీసన్ చెప్పారు. వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని ఈమె సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే ఈమె చెప్పిన రీజన్ విన్నటువంటి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అనసూయని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన మెగా ఫ్యాన్స్ నువ్వేమైనా పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండడానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటున్నటువంటి అనసూయ ఇలాంటి మంచి పాత్రలు నటించినప్పుడు అలాగే స్టార్ హీరోల సినిమాలలో నటించినప్పుడు ప్రమోషన్లలో పాల్గొంటే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా గాడ్ ఫాదర్ విషయంలో మరోసారి ఈమెకు నెటిజెన్ల నుంచి చేదు అనుభవం తప్పలేదు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…