Movie News

Sree Leela: నటి శ్రీ లీల తల్లి పై ఎఫ్ఐఆర్ నమోదు.. అక్రమంగా ఇంట్లోకి చొరబడిందంటూ పోలీసులకు ఫిర్యాదు?

Sree Leela: రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో తెరికెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల.మొదటి సినిమాతోనే తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సందడి చేసిన ఈమెకు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా శ్రీ లీల వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండగా తన తల్లి మాత్రం ఓ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమెపై కర్ణాటకలోని అడిగుడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. అసలు ఈమెపై పోలీసు కేసు నమోదు కావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… నటి శ్రీ లీల తల్లిదండ్రులు సుమారు 20 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే గతంలో శ్రీ లీల తండ్రి శుభకర్ రావు మాట్లాడుతూ శ్రీ లీల తనకు పుట్టిన బిడ్డ కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీ లీలా తండ్రి శుభకర్ రావు తన తల్లి స్వర్ణలతపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఈయన ఇచ్చిన ఫిర్యాదులో స్వర్ణలత అక్టోబర్ మూడవ తేదీ బెంగళూరులోని కోరమంగళలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లోకి ఎటువంటి అనుమతి లేకుండా ప్రవేశించిందని ఈయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Sree Leela: అపార్ట్మెంట్ తాళాలు పగలగొట్టి..

ఇలా తన అనుమతి లేకుండా తన అపార్ట్మెంట్ తాళాలు పగలగొట్టి ఈమె ఇంట్లోకి అక్రమంగా చొరబడింది అంటూ శుభకర్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీ లీల తల్లి స్వర్ణ లత పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. మరి ఈ విషయం పై స్వర్ణలత ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago