ఓంకార్.. ‘ఆట’ షోతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌కి తన మార్క్ యాంకరింగ్ తో ఊపు తెచ్చిన ఓంకార్, ముఖంలో ఏ విధమైన హావభావలు కనపడకుండా యాంకరింగ్ చేస్తాడని విమర్శలు వచ్చినా… అదే తన స్టైల్ యాంకరింగా మార్చుకుని తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా కొనసాగుతున్నాడు. బుల్లితెరమీదే కాదు, టాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించాడు. డైరెక్టర్ గా ‘జీనియస్’, ‘రాజుగారి గది’, ‘రాజుగారి గది2’, ‘రాజు గారి గది 3’ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ జోడీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఓంకార్. అయితే తాజగా ఆయనకు కరోనా సోకినట్టుగా తెలుస్తోంది.
లాక్‌డౌన్ తర్వాత కొన్ని ఎపిసోడ్లు షూటింగ్ జరుపుకున్న ఈ కార్యక్రమం… ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఏమి జరిగిందా అని ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేసుకొగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓంకార్‌కి కరోనా పాజిటివ్ రావడంతో ఆ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్, టెక్నిషియన్స్, మిగతా సభ్యులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు బండ్ల గణేశ్ కరోనా బారిన పడగా టీవీ నటుడు ప్రభాకర్‌కు కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఓంకార్ కూడా ఆ లిస్టులో చేరాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…