Jabardasth: బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇక గత 10 సంవత్సరాల నుంచి ఎంతో ఆదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారిలో ఒక్కొకరు బయటకు వెళ్తున్నారు.
ఇప్పటికే నాగబాబు రోజా వెళ్లిపోగా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ కూడా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలో నుంచి బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ కూడా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలిసిందే. గత వారం జరిగిన ఎపిసోడ్ అనసూయకు జబర్దస్త్ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ కావడంతో జబర్దస్త్ టీమ్ తనకు వీడ్కోలు పలికారు.
ఇకపోతే ఈ కార్యక్రమం నుంచి అనసూయ వెళ్లిపోవడంతో అనసూయ స్థానంలోకి ఎవరు వస్తారని పెద్ద ఎత్తున ఆత్రుత ఏర్పడింది. అయితే గతంలో అనసూయ తన రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో అనసూయ స్థానాన్ని రష్మి భర్తీ చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి తిరిగి రష్మి రాబోతుందని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మరొక యాంకర్ మంజుష ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ టీమ్ కొత్త యాంకర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఏకంగా ఆమెను పల్లకిలో మోసుకొని తీసుకువచ్చారు. అయితే ఆమె ఎవరు ఏంటి అనే విషయం తెలియకుండా సస్పెన్స్ లో పెట్టారు.మరి అనసూయ స్థానంలో జబర్దస్త్ కార్యక్రమానికి రాబోయే ఆ కొత్త యాంకర్ ఎవరు ఏమిటి అనేది తెలియాలంటే మరొక రెండు రోజులు వేచి ఉండాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…