Anchor Pradeep: బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి యాంకర్ ప్రదీప్ గురించి అందరికీ సుపరిచితమే.గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమైన ప్రదీప్ అనంతరం ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అదేవిధంగా వెండి తెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా అలాగే సినిమాలలో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ప్రదీప్ పెళ్లి గురించి తరచు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇదివరకే ప్రదీప్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రదీప్ పూర్తిగా ఖండిస్తూ పెళ్లి వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు. అయితే తాజాగా మరోసారి డిజైనర్ నవ్య మారౌతుతో ప్రేమలో ఉన్నారని వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈ పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్ తాను తన రెండవ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండటం వల్ల ఈ పెళ్లి వార్తలపై ఆలస్యంగా స్పందిస్తున్నాను అయితే నవ్యతో నా పెళ్లి అంటూ వచ్చిన వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇంతవరకు తాను ఒకసారి కూడా ఆమెతో మాట్లాడలేదని తెలిపారు.
ప్రొఫెషన్ పరంగా నా టీం ఆమెతో మాట్లాడి ఉండవచ్చు అలాగే కొన్నిసార్లు తనని ట్యాగ్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పటివరకు తనతో మాట్లాడలేదని, తనతో నా పెళ్లి అంటూ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే మా కుటుంబం మా నాన్న కోల్పోయిన బాధ నుంచి బయట పడుతున్నారు. అయితే తన పెళ్లికి మరి కాస్త సమయం కావాల్సి ఉందని ప్రస్తుతం తాను తన రెండవ సినిమాతో బిజీగా ఉన్నానంటూ ప్రదీప్ క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…