బుల్లితెర మీద పేరు గడించిన టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా ఆపై బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ.. వచ్చిన సినిమా ఆఫర్లనూ కూడా వదులుకోకుండా వెండితెరపై కూడా ఈమధ్య బిజీ బిజీగానే ఉంటోంది నటి రష్మీ.
సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ ఈ అమ్మడికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. సుధీర్, రష్మి ల మధ్య ఎదో ఉందని.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఈ రష్మి, సుధీర్ లిద్దరూ వార్తలను కొట్టిపారేశారు. తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమె అంటూ క్లారిటీ ఇచ్చారు.అయినా కూడా ఇప్పటికీ వీరిద్దరి జంటకి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవం.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి తాజాగా తన ఇంస్టగ్రామ్ లో ఒక మీమ్ షేర్ చేసింది. అందులో ‘టాప్ పొజిషన్ కు వచ్చేందుకు ఆమె కచ్చితంగా అందరితో పడుకుందని అంటుంటారు’ అనే మీమ్ ఒకటి షేర్ చేసింది.. దానితో పాటూ ‘అవును, చాలామంది ఇలా ఎంతో సులువుగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు.’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ స్టొరీ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…