Movie News

Anchor Rashmi: రష్మీ బ్యాచిలర్ పార్టీ.. 9 ఏళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పేసిన యాంకర్?

Anchor Rashmi: యాంకర్ రష్మీ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ అనంతరం పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదోక్కుకోవాలని ప్రయత్నం చేశారు.ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమెకు గుర్తింపు రాకపోవడంతో బుల్లితెర కార్యక్రమాలకు పరిమితమయ్యారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్న రష్మీ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ ఉన్నప్పుడు ఈమెకు సుడిగాలి సుదీర్ మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేయడం, వీరిద్దరి మధ్య ఈ లవ్ ట్రాక్ హైలెట్ కావడంతో చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని భావించారు.

అదేవిధంగా ఎన్నోసార్లు జబర్దస్త్ కార్యక్రమం పై వీరికి పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇకపోతే వచ్చేవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా మరో పెళ్లి తంతు కార్యక్రమం మొదలైంది.వచ్చేవారం అక్క బావేక్కడ అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే రష్మీ సిగ్గు పడుతూ తన పెళ్లి గురించి ప్రకటించడం అందరిని షాక్ కి గురి చేసింది.

పెళ్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయిన రష్మీ…

త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు రష్మీ ప్రకటించడంతో అందరూ నిజంగానే ఈమె పెళ్లి చేసుకోబోతోందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా తన పెళ్లి గురించి చెబుతూ చివరిలో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.అయితే నిజంగానే రష్మి పెళ్లి కుదిరిందా లేకపోతే ప్రోమో కోసం ఇలా చేశారా అనే విషయం తెలియాల్సిందే.ఇక ప్రస్తుతం ఏమి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలతో పాటు పలు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago