Featured

శ్రీరామచంద్ర కోసం ఆటో నడిపిన యాంకర్ రవి.. అందేంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే?

బిగ్‌బాస్‌ తెలుగు రియాల్టీ సో మొదలై దాదాపు 3 నెలలు దాటి పోయింది. మొదట 19 మందితో మొదలైన ప్రయాణంలో ఐదుగురు మాత్రమే మిగిలారు. వీళ్ల గురి ఇప్పుడు టైటిల్‌ మీదే ఉంది. వీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి అటు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు కూడా సాయం చేస్తున్నారు.

తమకు ఇష్టమైన కంటెస్టెంట్ గెలవాలని ఎవరి ప్రయత్నం వాళ్లు చేసేస్తున్నారు. వివిధ ప్లాట్ ఫామ్ లలో తమ మద్ధతును ప్రకటిస్తున్నారు. ఫైనలిస్టుల్లో ఒకరికి ఓట్లేయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా యాంకర్ రవి కూడా తన ప్రచారం మొదలు పెట్టేశాడు.

ఇక హౌజ్ లో ఉన్న వాళ్లతో ఎక్కువగా రిలేషన్ పెంచుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే.. అది శ్రీరామచంద్రతోనే. శ్రీరామచంద్ర గెలుపు కోసం రవి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఐదుగురుకి టైటిల్ గెలిచే అర్హత ఉందంటూనే.. ఫైనల్ గా శ్రీరామ్ కే టైటిల్ దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు యాంకర్ రవి. అందరిలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో తన ప్రచారం మొదలు పెట్టాడు.

ఆటో దగ్గర నిలబడి.. బిగ్‌బాస్‌ హౌస్‌, అన్నపూర్ణ స్టూడియో అంటూ అరుస్తూ.. ప్రయాణికులను పిలిచే ప్రయత్నం చేశాడు. ఒక వ్యక్తి వచ్చి.. అన్న అంత తొందరగా బయటకు వచ్చావ్ ఏంటి అన్నా అని అడగ్గానే.. అలా బయటకు వచ్చాను కానుక ప్రజల మనస్సులను గెలిచాను అది చాలు అంటూ చెబుతూ.. ఆటోవాలాగా మారిపోయాడు రవి. ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి’ అంటూ ఆటో నడిపాడు. ఇక ఆటో అలా ముందుకు వెళ్తుండగా.. ఆటో వెనకాల ఓట్ ఫర్ శ్రీరామ చంద్ర అంటూ పోస్టర్ కనిపించింది. ఇలా రవి శ్రీరామ చంద్రకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago