Anchor Ravi: బుల్లితెరపై ఎన్నో చానల్స్ ద్వారా ఎన్నో టీవీ సీరియల్స్ ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెర ఛానల్ అయినటువంటి జీ తెలుగు ప్రతి ఏడాది ఎన్నో అవార్డులను ప్రదానం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫెంటాస్టిక్ అవార్డ్స్ పేరుతో జీ తెలుగు సెలబ్రిటీలకు పలు కేటగిరీలలో అవార్డులను ప్రదానం చేసింది.
ఫెంటాస్టిక్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఇందులో అవార్డులకు కూడా కాస్త డిఫరెంట్ గా పేర్లు పెట్టారు. ఇక ఈ కార్యక్రమం క్రిస్మస్ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఆదివారం ప్రసారం కానుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో కాస్త వైరల్ అవుతుంది.
ఇందులో భాగంగా యాంకర్ రవి తన నోటి దూల కారణంగా మరొక యాంకర్ అకుల్ బాలాజీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి యాంకర్ రవితో కలిసి బిగ్ బాస్ సిరి యాంకర్లుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే బెస్ట్ యాంకర్ గా అకుల్ బాలాజీని వేదికపైకి ఆహ్వానిస్తూ రవి వాగుడు వీరయ్య అని సంబోధించాడు.
ఇలా ఒక యాంకర్ ను పట్టుకొని వాగుడు వీరయ్య అనడంతో తనకు మంచిగా అనిపించడం లేదంటూ అకుల్ బాలాజీ యాంకర్ రవి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను అవార్డు తీసుకోకుండా వేదికపై నుంచి దిగి వెళ్లిపోయారు.దీంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది. అయితే ఇది ప్రోమో కోసమే చేశారా లేకపోతే నిజంగానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారా అనే విషయం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…
మెగాస్టార్ చిరంజీవికి భుజం సర్జరీ ఆందోళన వద్దు.. కోలుకుంటున్నానని స్వయంగా వెల్లడించిన స్టార్ హీరో సోషల్ మీడియాలో ఇటీవల ఒక…