Anchor Shyamala: యాంకర్ శ్యామల పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేసిన ఈమె అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అనంతరం యాంకర్ గా మారి పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈమె పలు సినిమా ఈవెంట్లకు యాంకర్ గా కొనసాగుతున్నారు.
ఇక శ్యామలకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని తనకు బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చింది. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్యామల బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే గత ఏడాది జూలై నెలలో ఈమె నూతన గృహప్రవేశానికి సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా శ్యామల దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.ఇలా ఈమె కొత్త ఇంట్లోకి చేరి సంవత్సరం కూడా గడవకముందే మరో ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే శ్యామల తన కుమారుడు భర్తతో కలిసి కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఈమె ఈ విషయాన్ని చెప్పడంతో కొందరు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెప్పగా మరి కొందరు మాత్రం ఏడాది గడవకుండానే మరో ఇల్లు కట్టడం ఎలా సాధ్యం అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది శ్యామల గారు అంటు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం మీరు పెద్దగా షోలు కూడా ఏమీ చేయలేదు కదా పైగా సెలబ్రిటీలు ఇల్లు కట్టాలంటే కోట్లలో ఖర్చవుతుంది… ఇది ఎలా సాధ్యమండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…