Anchor Shyamala: తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్లుగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్యామల ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో సీరియల్ నటిగా పలు సీరియల్స్ చేశారు. అనంతరం యాంకర్ గా స్థిరపడ్డారు. ఇప్పటికీ పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు.
ఇక శ్యామల చివరిగా విరూపాక్ష సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి శ్యామల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె కెరియర్ మొదట్లో తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను తెలియజేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
లవ్ ప్రపోజ్ చేశారు…
తాను తన తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చి సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో చాలామంది తనకు ప్రపోజ్ చేశారని, చాలామంది నన్ను విసిగించారని ఈమె తెలిపారు. ఇక నేను నటిస్తున్నటువంటి ఒక సీరియల్ కెమెరామెన్ అర్ధరాత్రి ఫోన్ చేసి విసిగించేవాడు ఒకరోజు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగా ఇంట్లో అసలే మగదిక్కు లేరు. నేను ఏమైనా చేయగలను మీ కూతురు కనీసం నాతో మాట్లాడటం కూడా లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారని శ్యామల తెలిపారు. ఆ దెబ్బతో నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ కొంతమంది చెప్పిన ధైర్యమే నన్ను ముందుకు నడిపించిందని శ్యామల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…