Anchor Suma: శృతిమించిన సుమ కామెడీ.. ఏకంగా ఆ సింగర్ ను పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్స్.. వీడియో వైరల్!

Anchor Suma: శృతిమించిన సుమ కామెడీ.. ఏకంగా ఆ సింగర్ ను పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్స్.. వీడియో వైరల్!

Anchor Suma: తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ క్యాష్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. సుమ అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎంతోమందిని ఆకట్టుకునే సుమ క్యాష్ కార్యక్రమంలో కంటెస్టెంట్ తో నిర్వహించే స్కిట్లు శృతిమించుతున్నాయని చెప్పాలి.

Anchor Suma: శృతిమించిన సుమ కామెడీ.. ఏకంగా ఆ సింగర్ ను పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్స్.. వీడియో వైరల్!
Anchor Suma: శృతిమించిన సుమ కామెడీ.. ఏకంగా ఆ సింగర్ ను పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్స్.. వీడియో వైరల్!

ఇక నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సుమ క్యాష్ కార్యక్రమానికి సింగర్లు హాజరయ్యారు. సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి, మోహన భోగరాజు, అరుణ్ కౌండిన్య హాజరయ్యారు.ఎప్పటిలాగే సుమ ఈ కంటెస్టెంట్ లతో తమదైన శైలిలో వారిపై పంచులు వేస్తూ అందరిని నవ్వించారు.

Anchor Suma: శృతిమించిన సుమ కామెడీ.. ఏకంగా ఆ సింగర్ ను పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్స్.. వీడియో వైరల్!

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో భాగంగా సుమ కాస్త శృతి మించి కామెడీ చేసింది. ఏకంగా సింగర్ అరుణ్ కౌండిన్యను పెళ్లి చేసుకుంటానని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అరుణ్ . లా లా భీమ్లా అనే పాటను పాడి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే సుమ లా లా భీమ్లా అనే పాటతో కౌండిన్యను ఏడిపించింది.

కూతురిగా ఉంటా…

ఈ విధంగా తనతో కామెడీ చేస్తూ ఏకంగా సుమ అరుణ్ ను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ కామెంట్ చేశారు. సుమ ఈ విధంగా అనగానే వెంటనే సింగర్ అరుణ్ స్పందిస్తూ.. ఇంతకు ముందే అమ్మ అన్నారని ప్రశ్నించగా ఇంకోసారి నీ కూతురుగా కూడా ఉంటాను అంటూ సుమ సింగర్ అరుణ్ ను తనదైన శైలిలో ఆట పట్టించారు. అలాగే ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ చేత పలు టాస్క్ లలో సుమ అందరినీ సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.