Anchor Udaya Bhanu: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఉదయభాను గురించి తెలియని వారంటూ ఉండరు. బుల్లితెర శ్రీదేవిగా గుర్తింపు పొందిన ఉదయభాను ఎన్నో టీవీ షోలో యాంకర్ గా వ్యవహరించి ప్రేక్షకులకు దగ్గర అయింది. అంతేకాకుండా సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది.
ఉదయభాను వివాహం చేసుకొని ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీకి చాలా కాలం దూరంగా ఉంది. ప్రస్తుతం ఉదయభాను మళ్ళీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అడపాదడపా టీవి షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హోస్ట్ వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. అంతేకాకుండా ఉదయభాను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి దాని ద్వారా వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సరదాగా ఉదయభాను తన కొత్త ఇంటికి సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ఉదయభాను తన కొత్త ఇంటి హోమ్ టూర్ ని షేర్ చేసింది.
ఈ వీడియోలో ఉదయభాను ఇంటిని చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఉదయభాను కొత్తగా నిర్మించుకున్న ఇల్లు ఇంద్ర భవనానికి ఏమాత్రం తీసిపోదు. .ఉదయభాను షేర్ చేసిన హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా యూట్యూబ్ ద్వారా హోమ్ టూర్ వీడియోస్ మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూడా ప్రతి విషయాన్ని వీడియో రూపంలో షేర్ చేస్తూ ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…