సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనీ మాస్టర్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. తక్కువ ఓట్లు పడటంతో, అలాగే ఓటింగ్లో కూడా లీస్ట్ లో ఉండటం వల్ల అని మాస్టర్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి ఎపిసోడ్ నుంచి తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. అలా 11వ వారం వరకూ వచ్చింది అనీ మాస్టర్.
తనకు ఇచ్చిన టాస్క్ ను సవ్యంగా పూర్తి చేస్తూ, కొన్ని టాస్క్ లలో సోలోగా కూడా గెలిచి కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ను కూడా సాధించింది. అలాగే ఇమ్యూనిటీ టాస్క్ లో కూడా సోలో గెలిచి, ఇమ్యూనిటీని పొంది మానస్ ను కూడా సేఫ్ చేసింది. ఇదే కాకుండా మేల్ కంటెస్టెంట్ ఆయన జెస్సితో కూడా కుస్తీకి సైతం దిగింది.అన్ని టాస్క్ లలో కూడా 100 శాతం పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
కానీ బయట సోషల్ మీడియాలో అనీ మాస్టర్ కు పెద్దగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేకపోయింది. అలాగే కొన్ని సందర్భాలలో హౌస్మేట్స్ ను ఇమిటేట్ చేస్తూ ప్రెసిడెంట్ అవ్వడం, కాజల్ ను పదే పదే ఎక్కిరిస్తూ డాన్స్ చేయడం అనేది అనీ మాస్టర్ కు మైనస్ గా మారాయి. ఈ క్రమంలోనే లాస్ట్ వీక్ అనీ మాస్టర్ నామినేషన్స్ లో టాస్క్ ఆడేటప్పుడు శ్రుతిమించి మరీ కాజల్ పైకి వెళ్ళింది. కాజల్ విషయంలో అలాగే ప్రియాంక విషయంలో డీప్ గా హర్ట్ అయింది అనీ మాస్టర్.
అలాగే టాస్క్ లో గేమ్ ఆడుతున్న వారిని గ్రూప్ గానే గేమ్ ఆడుతూ ఎదుటి వారిని గ్రూప్ గేమ్ అనడం, పింకీ తో వాదించడం లాంటివి అని మాస్టర్ గేమ్ ని బాగా దెబ్బతీశాయి. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో అనేకసార్లు ఈమెను మోసం కూడా చేశారు. తనకు ఏది జెన్యూన్ అనిపిస్తే అదే మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే అనీ మాస్టర్ బిగ్ బాస్ టాప్ ఫైవ్ లిస్టులో ఉంటుందని అనుకున్నారు. కానీ ఇలా ఎలిమినేట్ అయిపోయి అభిమానులకు షాక్ ఇచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…