Featured

Anil Ravipudi : ట్రోలింగ్ పై స్పందించిన అనిల్… కావాలనే కొంతమంది నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారంటూ కామెంట్స్..!

Anil Ravipudi : అనిల్ రావిపూడి ఇపుడు f3 సినిమా ప్రచార కార్యక్రమాలతో ప్రస్తుతం మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. ప్రమోషన్సలో భాగంగా అనిల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా గురించిన వివరాలను చెబుతూనే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి చెప్తున్నారు. శుక్రవారం నాడు విడుదల కాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సినిమాకి మొదటిరోజు గనుక పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక పదిరోజులు మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది.

ఆ హక్కు నాకు లేదు……

ఇక ఈ సినిమా ముచ్చట్లలో భాగంగా మీడియాలో అడిగిన రకరకాల ప్రశ్నలకు అనిల్ సమాధానాలు చెప్పారు. ఇక తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి తొలిసారి స్పందించారు. ఇక అనిల్ మాట్లాడుతూ కావాలనే కొంతమంది టీంగా ఏర్పడి తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి పాల్పడుతున్నారని అన్నారు. ఒకవేళ వాళ్లు ట్రోల్ చేసినట్టు నా సినిమాల్లో తప్పులు ఉంటే ఎందుకు ఆడుతాయని ప్రశ్నించారు. నా సినిమాలను ఎంజాయ్ చేసే వాళ్లు ఉన్నారు కాబట్టి సినిమాలు హిట్ అవుతున్నాయని, లెట్ దెమ్ ఎంజాయ్ అంటూ మాట్లాడారు. అలా ట్రోల్ చేసే టీంకి అదొక ఎంజాయ్ మెంట్ అని దాన్ని కాదనే హక్కు నాకు లేదని చెప్పారు.

అయితే ఆ టీం ఎవరో తనకు తెలుసంటూ అసలు విషయం మాత్రం చెప్పలేదు అనిల్ రావిపూడి. ఇక f2 తరువాత f3 సినిమా తీసిన అనిల్ ఆ తరువాత f4 కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. F2 కి, f3 కి కథలో సంబంధం లేదని అయితే పాత్రలు మాత్రం అవేనని అదనంగా మరికొంతమంది నవ్వులు పంచుతారని ఇక మరీ ముఖ్యంగా చాలా ఏళ్ల తరువాత సునీల్ బాగా నవ్విస్తారని చెప్పాడు.

Bhargavi

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

3 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

3 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

3 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

3 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

3 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

3 hours ago