Categories: FeaturedGeneral News

కరోనా విషయంలో మరో ముందడుగు.. వైరస్ కట్టడి సాధ్యమే..?

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వైరస్ పై అనేక పరిశోధనలు జరుపుతున్నారు. ఈ పరిశోధనల్లో కరోనా వైరస్ కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురు చేస్తున్నాయి.

మందులు, వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడ, ఎవరికి, ఏ విధంగా సోకుతుందో తెలియని కరోనా వైరస్ గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ విషయంలో మరో ముందడుగు వేశారు. కరోనా ఏ విధంగా మనిషికి ఇన్ఫెక్షన్ కలిగిస్తుందో తెలుసుకునేందుకు ప్రత్యేక సాధనాన్ని తయారు చేశారు.

అమెరికాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్సింగ్‌ ట్రాన్స్‌లేషనల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు కొమ్ము ఆకృతిలో స్పైక్‌ ప్రొటీన్లు కరోనా వైరస్ పై ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రోటీన్లు మనుషుల శరీరంలోని ఏసీఈ2 అనే భాగానికి అతుక్కొంటున్నాయని.. ఆ తర్వాత వైరస్ కణంలోకి ప్రవేశిస్తోందని శాస్త్రవేత్తలు తేల్చారు. క్వాంటమ్‌ డాట్‌ అనే ఫ్లోరోసెంట్‌ నానో రేణువు సహాయంలో పరిశోధనలు చేసి ఈ విషయాలను తెలిపారు.

కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తరువాత అనేక పనులను నిర్వహిస్తోందని.. మరిన్ని పరిశోధనలు చేసి వైరస్ యొక్క కదలికలను పూర్తిస్థాయిలో గుర్తించాలని పేర్కొన్నారు. క్వాంటమ్ డాట్ నానో రేణువు సహాయంతో చేసిన పరిశోధనల ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని.. త్వరలో మానవ శరీరంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కొత్త మందును తయారు చేస్తున్నామని.. కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago